Site icon HashtagU Telugu

INS Vikrant : ఒక నౌకలో 30 విమానాలు.. ‘ఐఎన్ఎస్ విక్రాంత్‌‌’లో రెండు కొత్త టెక్నాలజీలు

Ins Vikrant

Ins Vikrant

INS Vikrant : ‘ఐఎన్ఎస్ విక్రాంత్’.. భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో నిర్వహించే ఇంటర్నేషనల్ నేవల్ ఎక్సర్‌సైజ్ ‘మిలన్-2024’ సందర్భంగా దీన్ని భారత నౌకాదళం తూర్పు తీరంలో మోహరించనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.. INS విక్రాంత్‌లో ఇప్పుడు అధునాతన గైడెన్స్ రాడార్, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను అమర్చారు.  దీనిలో అమర్చిన రాడార్ పేరు MF-STAR. MF-STAR అంటే..  మల్టీ ఫంక్షన్ సర్వైలెన్స్  ట్రాక్ అండ్ గైడెన్స్ రాడార్. దీనిలో అమర్చిన మిస్సైల్స్ పేరు బరాక్-8 MRSAM. MRSAM అంటే.. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు. ఇవి రెండూ ఇజ్రాయెలీ ఆర్మీ టెక్నాలజీతో తయారు చేసినవి. ఈ రెండు టెక్నాలజీలను ఇప్పటికే కోల్‌కతా, విశాఖపట్నం క్లాస్‌కు చెందిన ఫ్రంట్‌లైన్ ఇండియన్ డెస్ట్రాయర్‌లలో వినియోగిస్తున్నారు. MF-STAR అనే రాడార్‌తో 80 కిలోమీటర్ల రేంజ్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, వాయుమార్గంలోని ఇతర లక్ష్యాలను గుర్తించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఐఎన్ఎస్ విక్రాంత్ విశేషాలు

Also Read: Loose Bolt Alert : ఆ విమానాలకు లూజ్ బోల్ట్ హెచ్చరిక.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అలర్ట్