Site icon HashtagU Telugu

First Apple Store: ఇండియాలో తొలి యాపిల్ స్టోర్.. ‘టిమ్ కుక్’ గ్రాండ్ ఓపెన్!

Apple Store

Apple Store

ప్రస్తుతం ఇండియా (India) అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే యూపీఐ, బ్యాంకింగ్, ఇతర ఆర్థిక లావాదేవీల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. నేటి టెక్నాలజీని సైతం అందిపుచ్చుకొని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది మన దేశం. ఈ నేపథ్యంలో మన దేశంలోని ముంబైలో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభమైంది. Apple CEO టిమ్ కుక్ (Tim Cook) మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించారు. టీమ్ కుక్ వెంట భారత ఐటీ ప్రముఖులు, బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు.

ముంబై (Mumbai)లో భారతదేశపు మొట్టమొదటి Apple రిటైల్ స్టోర్ ప్రారంభం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐఫోన్ తయారీదారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రత్యేకమైన స్టోర్‌ను ప్రారంభించేందుకు ఇండియాకు వచ్చారు. దేశీయ మొబైల్‌ (Mobile) మార్కెట్లోకి అడుగుపెట్టి 25 ఏండ్లు పూర్తిచేసుకున్న యాపిల్‌ సంస్థ.. దేశీయ మార్కెట్‌లో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక స్టోర్లను ప్రారంభించినట్టు తెలిపింది.

భారత్‌లో సంస్కృతితోపాటు అద్భుతమైన శక్తిదాగివుందని, కస్టమర్టకు దీర్ఘకాలికంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి 5 బిలియన్‌ డాలర్ల విలువైన మొబైళ్లు విదేశాలకు యాపిల్‌ ఎగుమతి అయ్యాయని చెప్పారు. దేశంలో తొలి యాపిల్ స్టోర్ (First Apple Store) ప్రారంభం కావడంతో ఇండియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Siddharth’s Takkar Teaser: సెక్స్ అయితే ఓకే కానీ.. ఈ ప్రేమ, పెళ్లి వద్దు!