PM Modi: జీవవైవిధ్యం పరిరక్షించడంలో భారత్ కృషి మరువలేనిది: పీఎం మోడీ

పునరుత్పాదక శక్తి స్థాపనలో భారత్  మొదటి ఐదు దేశాల్లో నిలిచిందని..ప్రధాని వివరించారు.

  • Written By:
  • Updated On - July 28, 2023 / 02:57 PM IST

జీవవైవిధ్య పరిరక్షణ, పునరుద్ధరణ, సుసంపన్నతకు చేస్తున్న కృషిలో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పుడు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మరింత ఉన్నతస్థాయికి చేరుకుందని మోదీ వివరించారు. శిలాజ రహిత ఇంధన వనరుల సముపార్జనలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా పునరుత్పాదక శక్తి స్థాపనలో భారత్  మొదటి ఐదు దేశాల్లో నిలిచిందని..ప్రధాని వివరించారు.

చెన్నైలో జరిగిన వాతావరణం, పర్యావరణ పరిరక్షణ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ. సౌర విద్యుత్ స్థాపనకు మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. కార్చిచ్చులు, మైనింగ్ ప్రభావిత ప్రాంతాలపునరుద్ధరణకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు వివరించారు. ప్రాజెక్ట్ టైగర్ చేపట్టడం ద్వారా ప్రపంచంలోనే భారత్ లో పులుల సంఖ్య 70 శాతానికి పెరిగాయని తెలిపారు. ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ పై పనిచేస్తున్నట్లు చెప్పారు. మిషన్ అమృత్ సరోవర్ ద్వారా సంవత్సరంలోనే 63వేల కంటే ఎక్కువ నీటి వనరులను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. నమామీ గంగే చేపట్టిన తర్వాత గంగా నదిలో మళ్లీ డాల్ఫిన్ లు కనిపిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Prabhas FB: ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్.. డార్లింగ్ టీం అలర్ట్