Site icon HashtagU Telugu

Automobile : ఆటో మొబైల్ రంగాన్ని చిదిమేసిన `చిప్‌`లు

ద‌శాబ్ద కాలంలో అత్యంత సంక్షోభ పండ‌గ సీజ‌న్ ను ఈసారి ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా చిప్ కొరత ప్రభావం మైక్రో ప్రాసెసర్‌లు, చిప్‌లు సెమీకండక్టర్‌ల కొర‌త ఏర్ప‌డింది. దీంతో ఎయిర్ బ్యాగ్ లు, నావిగేషన్ వ్య‌వ‌స్థ‌, ఆడియో, వీడియో వ్య‌వ‌స్థ‌ల‌ను కార్ల‌లో ఏర్పాటు చేయ‌లేక‌పోయారు. ఫ‌లితంగా పండుగ సీజ‌న్ లో డిమాండ్ కు త‌గిన విధంగా కార్ల‌ను అందించ‌లేక పోయారు. పైగా ఎంట్రీ లెవ‌ల్ కార్ల కొనుగోలు శ‌క్తి త‌గ్గింద‌ని ఆటోమొబైల్ రంగం అంచ‌నా వేస్తోంది. గ‌త ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది 18శాతం ఆటోమొబైల్ రంగం క్షీణించింది.భారతదేశంలో ఇటీవలి పండుగల సీజన్‌లో 42 రోజుల వ్య‌వ‌ధిలో భారతదేశం అంతటా వాహన రిటైల్ ఈ ఏడాది 18% క్షీణతను నమోదు చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ ప్రకారం..”గత దశాబ్దంలో అత్యంత చెత్త పండుగ సీజన్‌ని చూసిన‌ట్టు తేలింది. ఇ ప్పటికీ సెమీ-కండక్టర్ కొరత పూర్తి స్థాయి సంక్షోభాన్ని ఆ రంగం ఎదుర్కొంటోంది. SUV, కాంపాక్ట్-SUV, లగ్జరీ కేటగిరీలు వాహనాల కొరత బాగా ఏర్ప‌డింద‌ని ఆటోమొబైల్ ఫెడరేషన్ తెలిపింది. “మరోవైపు, ఎంట్రీ-లెవల్ కార్లకు డిమాండ్ తగ్గింది.

Also Read : రైతుల కంట క‌న్నీరు మిగిల్చిన వ‌ర్షాలు…ల‌క్ష‌ల హెక్టార్లో పంట న‌ష్టం

గత దశాబ్దంలో అత్యంత చెత్త పండుగ సీజన్‌ని ఆటోమొబైల రంగం చూసింది. చిప్ కొరత ప్రభావం మైక్రోప్రాసెసర్‌లు, చిప్‌ల, సెమీకండక్టర్‌లు ల‌పై ప‌డింది. దీంతో ఎయిర్‌బ్యాగ్‌లు, ఆడియో,వీడియో లాంటి వినోదం వెసుల బాటు క‌ల్పించ‌లేక పోయారు. నావిగేషన్, ఘర్షణ గుర్తింపు వ్యవస్థ, రిమోట్‌గా ఎయిర్ కండిషనింగ్‌ ఆన్ చేయడం త‌దిత‌రాలు నిలిచిపోయాయి.కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు పూర్తి లాక్‌డౌన్ విధించడంతో 2020లో గ్లోబల్ చిప్ కొరత మొదలైంది.డిసెంబర్ 2020, బాష్ ఇండియా యూనిట్ ఇప్పటికే ఈ సమస్యను ఫ్లాగ్ చేసింది, దేశంలో ఆటో రంగ డిమాండ్‌ను తీర్చడంలో దాని అసమర్థతను సూచిస్తుంది. అలాగే ప‌లు కంపెనీలు డిమాండ్ కు త‌గిన విధంగా చిప్ ల‌ను త‌యారు చేయలేక పోవ‌డంతో ఆటోమొలైల్ రంగం కుదేలు అయింది.