Pushpak Viman : మన ఇస్రో మరో ఘనత సాధించింది. పుష్పక్ విమాన్‌ను శుక్రవారం ఉదయం కర్ణాటకలోని డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న చలకెరె రన్‌వే నుంచి సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు. ‘‘పుష్పక్’’.. ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వీ). రాకెట్‌నే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని పిలుస్తారు. ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇప్పటివరకు మన ఇస్రో ఉపయోగిస్తున్న రాకెట్లు వాటి పనిని పూర్తి చేశాక సముద్రంలో కూలిపోతుంటాయి. కానీ తనతో పాటు తీసుకెళ్లే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి వదిలేశాక.. సురక్షితంగా తిరిగి భూమిపైకి వచ్చేయడమే ‘పుష్పక్’ రాకెట్(Pushpak Viman) ప్రత్యేకత.
We’re now on WhatsApp. Click to Join
ప్రయోగం ఇలా జరిగింది..
ప్రయోగంలో భాగంగా పుష్పక్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా గగనతలంలోకి తీసుకెళ్లారు. చలకెరె రన్‌వే నుంచి దాదాపు దాదాపు 4 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. దాదాపు 4.5 కి.మీ ఎత్తు నుంచి పుష్పక్ రాకెట్‌ను వదిలేశారు. అనంతరం పుష్పక్ తనంతట తానుగా నేవిగేషన్ చేసుకుంటూ మళ్లీ రన్‌వేపైకి సేఫ్‌గా వచ్చేసింది. శాస్త్రవేత్తలు అంచనా వేసిన విధంగా పుష్పక్ అత్యంత ఖచ్చితంగా ల్యాండ్ అయింది. రన్‌వేపైకి పుష్పక్ ల్యాండ్ కాగానే దాని బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్‌లు, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యాయి. దీంతో అది తనంతట తానుగా వేగాన్ని తగ్గించుకొని ఆగిపోయింది. గత నెలలో కేరళలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ పుష్పక్ గురించి వివరించారు. అంతకు ముందు 2016లో ఒకసారి, 2023 ఏప్రిల్ 2న రెండోసారి ‘పుష్పక్’ రాకెట్‌ను పరీక్షించారు. దాన్ని పరీక్షించడం ఇది మూడోసారి.
Also Read :
‘పుష్పక్’ విశేషాలు
- పుష్పక్ రాకెట్ పొడవు 6.5 మీటర్లు, బరువు 1.75 టన్నులు.
- పుష్పక్ రాకెట్‌లో చిన్నపాటి థ్రస్టర్లు, సెల్ఫ్ గైడింగ్ రోబోటిక్ టెక్నాలజీ ఉంటాయి. ఇవి యాక్టివ్ అయ్యాక.. ఏ వైపు ప్రయాణం చేయాలి? ఎక్కడ ల్యాండ్ కావాలి ? అనే దానిపై గైడెన్స్ ఇస్తాయి.
- పుష్పక్ రాకెట్‌ను డెవలప్ చేసే ప్రాజెక్టుపై భారత సర్కారు ఇప్పటిదాకా దాదాపు రూ.100 కోట్లకుపైనే ఖర్చు చేసింది.
- 2035 నాటికి భారత్ ఏర్పాటు చేయనున్న సొంత అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు ‘పుష్పక్’ ఎంతో దోహదం చేస్తుందని అంటున్నారు.
- అంతరిక్షంలోని మన ఉపగ్రహాలను రిపేర్ చేసేందుకు, వాటిలో ఇంధనాన్ని నింపేందుకు ‘పుష్పక్’ను వాడుకోవాలని ఇస్రో భావిస్తోంది.
Also Read : Flying Cars: త్వరలోనే ప్రపంచ మార్కెట్‌లోకి ఎగిరే కార్లు .. లాంచ్ ఎప్పుడంటే..?
RLV-LEX-02:
The approach and the landing. pic.twitter.com/hI9k86KiBv— ISRO (@isro) March 22, 2024