Site icon HashtagU Telugu

SIM Cards – 2024 : ‘సిమ్’ కోసం డాక్యుమెంట్స్ మోసుకెళ్లక్కర్లేదు

Sim Cards October 1 rules

Sim Cards October 1 rules

SIM Cards – 2024 : సిమ్ కార్డు.. ఇది కావాలంటే ఇప్పటిదాకా మనం ఐడీ ప్రూఫ్‌లను తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి వచ్చేది. ఇంటి అడ్రస్ ప్రూఫ్‌ను ఫిజికల్‌గా సబ్మిట్ చేయాల్సి వచ్చేది. కొంతసేపు ఓపిగ్గా కూర్చొని అప్లికేషన్ ఫామ్‌ను భర్తీ చేయాల్సి వచ్చేది.. 2024 సంవత్సరం నుంచి ఈ పనంతా ఉండబోదు. సిమ్ కార్డును జారీ చేసేందుకు ఉద్దేశించిన ఈ ఫిజికల్ అప్లికేషన్ ప్రక్రియను ఎత్తేస్తూ కేంద్ర టెలికాం శాఖ (DoT) ఇప్పటికే నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అంటే .. నూతన సంవత్సరం నుంచి సిమ్‌ను జారీ చేసేందుకు మనదేశ టెలికాం కంపెనీలు ఫిజికల్‌ KYC ప్రక్రియను నిలిపివేస్తాయి. దీనివల్ల కస్టమర్‌కు రైటింగ్ వర్క్ , ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చే వర్క్ లేకుండా పోతుంది.  ఇదే ప్రక్రియను ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలో చేపట్టనున్నారు. ఫలితంగా సిమ్ కార్డుల జారీలో మోసాలకు తావు లేకుండా చూడొచ్చని, సంఘ విద్రోహ శక్తులకు సిమ్ కార్డులు జారీ కాకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వచ్చే సంవత్సరం నుంచి ప్రజలకు ఆధార్ నంబర్, బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా సిమ్ కార్డు ఇష్యూ చేస్తారు. దీనివల్ల నిమిషాల్లో కొత్త SIM జారీ అవుతుంది. కొన్ని గంటల్లోనే ఆపరేటర్ ఆ సిమ్‌కు టెలికాం సేవలను యాక్టివేట్ చేస్తాడు. ఇప్పటివరకు సిమ్ కావాలి అనుకునే వారు అప్లికేషన్ ప్రాసెస్‌కు దాదాపు గంట టైం కేటాయించేవారు. ఇకపై ఆ సమయం ప్రజలకు ఆదా అవుతుంది.

Also Read: Free Bus Scheme : మహిళలకు బస్సు జర్నీ ఫ్రీ.. అలా చేయకుంటే రూ.500 ఫైన్

గతంలో మోసగాళ్లు నకిలీ డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేసి ప్రీపెయిడ్ SIM కార్డ్‌లను పొందేవారు. ఇకపై ఈ ప్రక్రియ డిజిటల్‌కి మారుతుండటంతో.. అటువంటి ప్రమాదకర వ్యక్తులకు సిమ్ కార్డులను జారీ చేసే అవకాశాలు తగ్గుతాయి. అప్లికేషన్ ఫారమ్‌లను ముద్రించడం, కస్టమర్‌లతో వాటిని నింపించడం వంటి పనులన్నీ తప్పుతాయి. వీటికి బదులుగా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను బెటర్ చేయడం, డిజిటల్‌గా డాక్యుమెంటేషన్ ఉన్నవారికే సిమ్ కార్డులను జారీ చేయడం, వెంటనే సిమ్‌ను యాక్టివేట్ చేయించడం వంటి వాటిపై టెలికాం కంపెనీలు ఫోకస్(SIM Cards – 2024) చేయనున్నాయి.