Site icon HashtagU Telugu

Ukraine Indian Students: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇతర కాలేజీల్లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్!

Ukraine Students

Ukraine Students

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో మెడికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లిన భారత విద్యార్థులు పడ్డ ఇబ్బంది అంతాఇంతా కాదు.
వాళ్ళు అర్థాంతరంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పటికీ ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం కారణంగా విద్యాసంస్థల మూసివేత అమల్లో ఉంది. వైద్య విద్య ఆగిపోవడంతో భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉక్రెయిన్ వర్సిటీల్లో చదివిన వైద్య విద్యార్థులు ఇకపై భారత్ లోని మెడికల్ కాలేజీల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లోనూ చేరేందుకు అనుమతించింది. ఈ నిర్ణయం భారత వైద్య విద్యార్థులకు ఊరట కలిగించేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.

గతంలో విదేశీ వర్సిటీల్లో చదివే భారత విద్యార్థులు కోర్సు మధ్యలో కాలేజీ మారడం వీలయ్యేది కాదు. కోర్సు యావత్తు ఒకే కాలేజీలో చదవాల్సి వచ్చేది. ట్రైనింగ్, ఇంటర్న్ షిప్, అదే విదేశీ వర్సిటీలో పూర్తిచేయాల్సి వచ్చేది. అయితే, వందలాది మంది భారత విద్యార్థుల కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని.. కాలేజీ బదిలీ వెసులుబాటును ఎన్ఎంసీ కల్పించింది. ఉక్రెయిన్ దేశం కూడా భారత విద్యార్థుల ట్రాన్సఫర్ కు సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ బదిలీ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లో భారత విద్యార్థులు చదివినప్పటికీ.. సర్టిఫికెట్ మాత్రం ఉక్రెయిన్ లోని మాతృ కళాశాల పేరిటే మంజూరు కానుంది. ఈవిషయాన్ని కూడా ఎన్ఎంసీ తాజా ప్రకటనలో వెల్లడించింది.

Exit mobile version