Site icon HashtagU Telugu

JD Vance : భారత శిల్పకళా నైపుణ్యం అబ్బురపరిచింది – జేడీ వాన్స్

Jd Vance India

Jd Vance India

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారత్ అభివృద్ధిపై ప్రత్యేక ఆసక్తి ఉందని, ఆయన విజన్‌లో భారత్ కీలక భాగస్వామిగా ఉందని జేడీ వాన్స్ పేర్కొన్నారు. మోదీ-ట్రంప్ నేతృత్వంలో రెండు దేశాలు అభివృద్ధి మార్గంలో కలిసి నడుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారతీయ శిల్పకళ, ఆర్కిటెక్చర్‌పై ప్రత్యేకంగా వ్యాఖ్యానించిన జేడీ వాన్స్.. “భారత శిల్పకళా నైపుణ్యం నన్ను అబ్బురపరిచింది. ఇక్కడి కళలు, సంప్రదాయ నిర్మాణాలు, చరిత్ర గల సంపద ప్రపంచానికి దారిచూపే విధంగా ఉన్నాయి” అన్నారు. భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతిని కలిగి ఉండటం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు.

Allu Arjun Vs Mega Fans : ‘చెప్పను బ్రదర్ ‘ కు 9 ఏళ్లు

అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై కూడా జేడీ వాన్స్ ప్రశంసలు కురిపించారు. “ఇక్కడ భారతీయులు తమ దేశాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. వారు తమ సంస్కృతిని నిలుపుకుంటూనే, అమెరికా అభివృద్ధిలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు. అలాగే భారత్‌కు అమెరికా ఇంధనంతో పాటు, అత్యాధునిక ఎఫ్35 యుద్ధ విమానాలను విక్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకున్న జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌లకు రాజస్థాన్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మంగళవారం ఉదయం వారు చారిత్రక ఆమెర్ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారి వారికి స్వాగతం పలికారు.