Site icon HashtagU Telugu

PM Modi – UAE : అబుధాబిలో మోడీ ఎమోషనల్ స్పీచ్.. ‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్’

Pm Modi Uae

Pm Modi Uae

PM Modi – UAE : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల యూఏఈ పర్యటన  మంగళవారం రాత్రి అబుధాబిలో అట్టహాసంగా మొదలైంది. ఈసందర్భంగా మోడీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల అధినేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ యూఏఈ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంగళవారం రాత్రి పర్యటనలోని ముఖ్య విశేషాలను(PM Modi – UAE) ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్’

అబుధాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించిన అహ్లాన్ మోడీ కార్యక్రమంలో భాగంగా తరలివచ్చిన 65వేల మంది ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులంతా సరికొత్త చరిత్రను సృష్టించారని, 140 కోట్ల మంది భారతీయులు వారిని చూసి గర్వపడుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇక్కడ ప్రతిఒక్కరి ప్రతిశ్వాస, గుండె చప్పుడు, స్వరం.. ‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్’ అని నినదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు. గత పదేళ్లలో తనకు ఇది  యూఏఈ ఏడో పర్యటన అని ప్రధాని తెలిపారు. 2019లో తనకు యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ జాయెద్’‌ను అందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఆ పురస్కారం కోట్లాది మంది భారతీయులు, గల్ఫ్ దేశంలో నివసిస్తున్న భారతీయ సమాజానికి అంకితమన్నారు. UAE అనేది భారతదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఏడో అతిపెద్ద పెట్టుబడిదారు అని చెప్పారు.  గల్ఫ్ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భారతీయ సమాజం ఎదుట ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించే ముందు “మోదీ, మోడీ” నినాదాలతో ఘన స్వాగతం పలికారు.

Also Read :Imran Tahir: టీ20ల్లో 500 వికెట్లు తీసిన నాలుగో బౌల‌ర్‌గా ఇమ్రాన్ తాహిర్ రికార్డు..!

సోదరుడికి ధన్యవాదాలంటూ మోడీ ట్వీట్

‘నాకు సాదర స్వాగతం పలికిన సోదరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ఏడు నెలల్లో మేము ఐదుసార్లు కలుసుకున్నాం. ఇది చాలా అరుదు. నేను కూడా ఇక్కడకు ఏడు సార్లు వచ్చే అవకాశం వచ్చింది. మేం ప్రతి రంగంలో ఎలా అభివృద్ధి సాధించామో, అక్కడ భారత్​, యూఏఈ మధ్య ఉమ్మడి భాగస్వామ్యం ఉంది’ అని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు, ‘సమయం వెచ్చించి మరీ నన్ను రిసీవ్​చేసుకోడానికి ఎయిర్​పోర్టుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా ఇంటికి, నా కుటుంబాన్ని కలిసినట్టు అనిపిస్తుంది’ అని ట్వీట్ చేశారు.

ఇవాళ ప్రోగ్రామ్స్ ఇవే.. 

ఇవాళ (ఫిబ్రవరి 14న) అబుధాబిలో బాప్స్ స్వామినారాయణ్‌ సంస్థ నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ వెంటనే అబుధాబిలో జరిగే వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం ఖతార్‌ దేశ పర్యటనకు మోడీ వెళ్లనున్నారు.

Also Read : Pawan Tour Postponed : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కు బ్రేక్..