Site icon HashtagU Telugu

Indian Passport Rank : సింగపూర్ పాస్ పోర్ట్ వరల్డ్ పవర్ ఫుల్.. ఇండియా ర్యాంకు ఎంత ?

Indian Passport Rank

Indian Passport Rank

Indian Passport Rank : భారతీయ పాస్‌పోర్ట్ ర్యాంక్ మెరుగుపడింది.. 

“హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023” ప్రకారం మనదేశపు పాస్‌పోర్ట్ ర్యాంక్ 87 నుంచి 80కి చేరింది. 

వీసా లేకుండానే భారతీయ పాస్‌పోర్ట్ తో 57 గమ్యస్థానాలకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 

టోగో,  సెనెగల్‌ దేశాల పాస్‌పోర్ట్  లు కూడా ఈ ఇండెక్స్‌లో ఇండియాతో పాటు 80వ స్థానంలోనే నిలవడం గమనార్హం.  

ఈ ఇండెక్స్ లో సింగపూర్ పాస్ పోర్ట్  టాప్ ప్లేస్ లో నిలిచింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్  టైటిల్‌ను సింగపూర్ పాస్ పోర్ట్ దక్కించుకుంది.  

Also read :Athulya Ravi : కొత్త లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న అతుల్యా రవి

సింగపూర్ పాస్ పోర్ట్..  వరల్డ్  పవర్ ఫుల్  పాస్ పోర్ట్ గా ఎంపిక కావడానికి ఒక కారణం(Indian Passport Rank) ఉంది. అదేమిటంటే..  ప్రపంచంలో పాస్ పోర్ట్ ద్వారా జర్నీ చేసే ఎయిర్ ట్రావెల్  డెస్టినేషన్స్‌ మొత్తం  227 ఉన్నాయి. సింగపూర్ పాస్ పోర్ట్ ఉంటే వాటిలో 192 ఎయిర్ ట్రావెల్  డెస్టినేషన్స్‌ కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఇక రెండో ప్లేస్ లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లతో 190 గమ్యస్థానాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. గత  ఐదేళ్లలో మొదటిసారిగా.. పవర్ ఫుల్ పాస్ పోర్ట్  ర్యాంక్ ను జపాన్ కోల్పోయింది. ఇప్పుడు దాని ర్యాంకు  మూడో స్థానానికి చేరింది. జపాన్ పాస్‌పోర్ట్ తో 189 గమ్యస్థానాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు.

Also read : ODI World Cup Squad: వరల్డ్ కప్ జట్టులో అతనుండాల్సిందే.. సెలక్టర్లకు దాదా కీలక సూచన..!

ఈ ఇండెక్స్  లో దాదాపు పదేళ్ల క్రితం అగ్రస్థానంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది. లిథువేనియా దేశపు పాస్ పోర్ట్ కూడా 8వ ర్యాంకును పొందింది.  ఈ రెండు దేశాల పాస్ పోర్ట్ తో  184 గమ్యస్థానాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. నాలుగు ర్యాంకులో ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ పాస్ పోర్ట్ తో వీసా లేకుండా 188 దేశాలను యాక్సెస్ చేయొచ్చు.  ఈ ర్యాంకింగ్ జాబితాలో ప్రపంచంలోని అత్యంత బలహీన పాస్ పోర్టుల లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు 27 గమ్యస్థానాలకు మాత్రమే వీసా లేకుండా జర్నీ చేయగలరు.

Also read : UPI With Indonesia: త్వరలో ఇండోనేషియాలో కూడా యూపీఐ సేవలు ప్రారంభం..?