Rahul Gandhi: రాహుల్ అమెరికా పర్యటన ప్రచార కార్యక్రమాలు షురూ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పది రోజుల అమెరికా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ అమెరికా పర్యటనను విజయవంతం చేసేందుకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశమైంది.

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పది రోజుల అమెరికా పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ అమెరికా పర్యటనను విజయవంతం చేసేందుకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశమైంది. ఈ మేరకు రాహుల్ ప్రోగ్రామ్‌లో ప్రవాస భారతీయులను సమీకరించడానికి ప్రచార వీడియోలను విడుదల చేశాడు.

రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కాంగ్రెస్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర కథనాలు ఈ వీడియోలో ప్లే అయ్యాయి. జోడో యాత్ర లక్షలాది మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చి, దాంతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు భారతీయ సంతతికి చెందిన వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ స్పెషల్ టాక్ న్యూయార్క్‌లోని జావిట్స్ సెంటర్‌లో జరుగుతుంది.

భారతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా గత వారం మాట్లాడుతూ రాహుల్ పర్యటన నిజమైన భాగస్వామ్య విలువలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉందని అన్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. జూన్ 4న జరిగే ఈ కార్యక్రమంలో 5 వేల మంది పాల్గొంటారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ ఈ పర్యటన శాన్ ఫ్రాన్సిస్కో లో మొదలవ్వనుంది. ఇక్కడ స్టాండ్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వాషింగ్టన్ DCలో చట్టసభ సభ్యులు మరియు థింక్ ట్యాంక్‌లతో సమావేశాలు నిర్వహిస్తారు. మే 30న కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో రాహుల్ గాంధీ ప్రేమ దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నారు, దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ‘మొహబ్బత్ కీ దుకాన్’ అని పేరు పెట్టారు.

 

Read More: PM Modi- Rahul Gandhi: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు.. తేల్చేసిన జాతీయ సర్వే..!