Yoga – Israel Schools : ఓ వైపు గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ తలమునకలై ఉండగా.. మరోవైపు ఇజ్రాయెల్ లోని భారత సంతతి మున్సిపల్ కౌన్సిలర్ రికీ షాయ్ యోగా కోసం ఉద్యమిస్తున్నారు. ఇజ్రాయెల్ లోని అన్ని స్కూళ్లలో యోగాను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రికీ షాయ్.. దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్ ప్రాంత మునిసిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు. ఈ ప్రాంతంపై కూడా హమాస్ కు చెందిన వందలాది రాకెట్లు పడ్డాయి. ఎంతోమంది చనిపోయారు. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి పరిస్థితుల నుంచి పిల్లలకు మానసిక ప్రశాంతతను కలిగించే గొప్ప సాధనం యోగా అని రికీ చెప్పారు. దీన్ని అన్ని స్కూళ్లలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇజ్రాయెల్ సర్కారును కోరారు. ‘‘ఇజ్రాయెల్ ప్రజలు నిత్యం టెన్షన్‌గా ఉంటున్నారు. రిలాక్స్ కావడానికి ఏ మార్గం కూడా లేదు. అందుకే పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలి’’ అని పేర్కొంటూ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. ‘‘ఇజ్రాయెల్‌లోని ప్రతి చిన్నారి యోగా చేయాలి. శిక్షణ పొందిన టీచర్ పిల్లలకు యోగా నేర్పిస్తారు. ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలపాలి’’ అని రికీ కోరారు. ఇక రికీ షాయ్ (Yoga – Israel Schools) బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. ఆమె తల్లి భారతీయురాలు, తండ్రి ఇజ్రాయెలీ.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఇవాళ ఉదయం కూడా ఇజ్రాయెల్ లోని పలు సరిహద్దు ప్రాంతాలపైకి హమాస్ మిలిటెంట్లు రాకెట్లు వేశారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక లెబనాన్ – ఇజ్రాయెల్ , లెబనాన్ – సిరియా మధ్య కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సిరియాలోని రెండు విమానాశ్రయాలపై మిస్సైల్ దాడి చేసిన ఇజ్రాయెల్, నిన్న లెబనాన్ బార్డర్ లోని ఓ గ్రామంపైనా దాడి చేసింది. దీంతో ఆ దేశాలు కూడా హై అలర్ట్ అయ్యాయి. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై ఆగ్రహంగా ఉంది. గాజాలోకి ఇజ్రాయెల్ అడుగుపెడితే యుద్ధం పెద్దది అవుతుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సపోర్ట్ కలిగిన లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది. యూదులపై యుద్ధం చేయడాన్ని తాము గౌరవంగా పరిగణిస్తామని ప్రకటించింది. ఈనేపథ్యంలో ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం మరింత పెరిగేలా కనిపిస్తోంది.