Indian Official Dead : అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారి ఒకరు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాలోని భారత ఎంబసీ(Indian Official Dead) కూడా ఈ వివరాలను ధ్రువీకరించింది. సెప్టెంబరు 18న వాషింగ్టన్‌లో భారత రాయబార కార్యాలయ అధికారి చనిపోయారని తెలిపింది. ఆయన భౌతిక కాయాన్ని భారత్‌కు పంపిస్తామని పేర్కొంది. మృతుడి కుటుంబం వివరాలను గోప్యంగా ఉంచే లక్ష్యంతో . మరణించిన వారి పూర్తి వివరాలను వెల్లడించడం లేదని భారత ఎంబసీ స్పష్టం చేసింది. సదరు అధికారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. అమెరికా పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సదరు భారత అధికారి సూసైడ్ చేసుకున్నారా ? హత్య జరిగిందా ? అనేది తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
Also Read :Drug Traffickers Clash : డ్రగ్స్ ముఠాల ఘర్షణ.. 100 మంది మృతి, మిస్సింగ్ !
భారత్‌పై కెనడా అక్కసు..
ఇటీవలే కెనడా దేశం భారతీయులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను తగ్గిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది 35 శాతం తక్కువగా అంతర్జాతీయ స్టడీ పర్మిట్లను ఇస్తామని తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది స్టడీ పర్మిట్ల సంఖ్యను మరో 10 శాతం మేర తగ్గిస్తామని కెనడా సర్కారు స్పష్టం చేసింది. ఈ పరిణామం కెనడాకు వెళ్లి చదువుకోవాలని భావించే భారతీయ విద్యార్థులకు ప్రతికూలమైందే. వాస్తవానికి కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో మొదటి నుంచీ భారత వ్యతిరేక ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కెనడాలో జరిగిన పలువురు ఖలిస్తాన్ తీవ్రవాదుల హత్యలకు భారత్‌తో ముడిపెట్టే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. అయితే ఆ ఆరోపణలను భారత ప్రభుత్వం మొదటి నుంచీ ఖండిస్తూ వస్తోంది. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈవిషయం కెనడా ప్రధాని ట్రూడోకు బాగా తెలుసు. అందుకే ఆయన విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లను తగ్గిస్తానని ఇటీవలే వెల్లడించారు.