Visakhapatnam:రక్షణ రంగంలోకి నూతన నౌకలు

ఇండియన్ నేవీలో మరో నాలుగు కొత్త యుద్ధ నౌకలు చేరనున్నాయి.

  • Written By:
  • Publish Date - November 17, 2021 / 08:18 AM IST

ఇండియన్ నేవీలో మరో నాలుగు కొత్త యుద్ధ నౌకలు చేరనున్నాయి. వీటిని ఇదే నెలలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆధ్వర్యంలో ముంబాయి నౌకాశ్రయంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. పి 15 బ్రేవో ప్రాజెక్టులో భాగంగా రానున్న ఈ విశాఖపట్టణం క్లాస్ డిస్ట్రాయర్స్ మెదటి ఫేజ్ లో నాలుగు రక్షణరంగంలోకి రానున్నాయి.

Also Read: విమాన ప్ర‌యాణ ఎత్తును పెంచుతోన్న వాతావ‌ర‌ణ మార్పులు

ఈ నౌకల్లో అత్యంత అధునాతన టెక్నాలజీని వాడనున్నారు. దీని పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు ఉంటుంది. 7,400 టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ నౌక ఇండియాలోని అత్యంత గోప్ప సామర్థ్యం గల నౌకగా రూపుదిద్దుకోనుంది. దీనిలో నాలుగు పవర్ ఫుల్ గ్యాస్ టర్బన్స్ ఉంటాయి ఇవి కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తో పనిచేస్తూ 30 కిలోనాట్స్ వేగంతో ప్రయాణించగలవు. రాడార్ టెక్నాలజీని కూడా దీనిలో మిళితం చేయనున్నారు.


వీటి తయారీకి 2011 జనవరిలోనే ఒప్పందం జరిగింది. ఆ దశాబ్దంలో వచ్చిన ప్రాజెక్ట్ 15 ఏ, కోల్ కతా క్లాస్ డిస్ట్రాయర్ మెడల్ ను పోలి ఉంటుంది. ఇండియన్ సముద్ర పరిధిలో ఈ నూతన నౌకలను పరీక్షించగా టాస్క్ ల విషయంలో, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ విషయంలో అద్భుతంగా పనిచేసినట్టు అధికారులు తెలిపారు.

Also Read: చంద్రుడిపై 800కోట్ల మందికి ల‌క్ష ఏళ్ల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్‌.. కానీ..