Indian Navy: సముద్రపు దొంగల ప్రయత్నాన్ని తిప్పి కొట్టిన భారత నావికాదళం

అరేబియా సముద్రంలో కార్గో షిప్‌ను హైజాక్ చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టినట్లు భారత నావికాదళం శనివారం వెల్లడించిందిమేరకు హైజాక్‌కు గురైన మాల్టా జెండాతో కూడిన కార్గో షిప్‌ను భారత నావికాదళం రక్షించింది.

Indian Navy: అరేబియా సముద్రంలో కార్గో షిప్‌ను హైజాక్ చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టినట్లు భారత నావికాదళం శనివారం వెల్లడించింది. ఈ మేరకు హైజాక్‌కు గురైన మాల్టా జెండాతో కూడిన కార్గో షిప్‌ను భారత నావికాదళం రక్షించింది. పరిస్థితిపై తక్షణ చర్యలు తీసుకున్న భారత నావికాదళం వెంటనే తమ నిఘా విమానాన్ని ఘటనా స్థలానికి పంపించిందని భారత నౌకాదళం తెలిపింది. మాల్టా నౌకకు సహాయంగా నావికాదళం యాంటీ పైరసీ పెట్రోలింగ్ యుద్ధనౌకను కూడా పంపింది. నావికాదళ విమానాలు మాల్టా నౌకను నిరంతరం గమనిస్తూ, ఓడ కదలికను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఈ నౌక సోమాలియా తీరం వైపు కదులుతోందని సంబంధిత అధికారులు తెలిపారు.

డిసెంబర్ 14న UKMTO పోర్టల్‌లో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓడ వద్దకు వస్తున్నారని సిబ్బంది సభ్యులు సందేశం పంపారు. ఈ సమాచారంపై మాల్టా నౌకకు సహాయం చేయడానికి నావికాదళం తన నిఘా విమానాన్ని పంపింది. ఓడలు అరేబియా సముద్రంలో సోమాలియా సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం సూచించింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో అనేక సముద్రపు దొంగల ముఠాలు కాపు కాచుకుని ఉంటాయి. నౌకలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే తెలియజేయాలని సూచించారు.

Also Read: Lok Sabha Elections: ముందస్తు ఎన్నికలకు మోడీ సై, జగన్, రేవంత్ అలర్ట్!