Site icon HashtagU Telugu

India Vs Pak : కరాచీలో క్షిపణి పరీక్షలు.. అరేబియా సముద్రంలో భారత్ ఏం చేసిందంటే..

Indian Navy Missile Test Arabian Sea India Vs Pakistan Kashmir

India Vs Pak : కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.  అయినా పాక్ తన దుందుడుకు స్వభావాన్ని మార్చుకోవడం లేదు. భారత్‌ను మరింతగా కవ్వించే చర్యలకు దిగుతోంది. ఈక్రమంలోనే కరాచీ తీరం వేదికగా మిస్సైళ్లను పాకిస్తాన్‌ ఆర్మీ పరీక్షిస్తోంది. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను పాక్ టెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది.  దీంతో భారత్ సైతం అలర్ట్ అయింది. కరాచీ నుంచి మహారాష్ట్రలోని ముంబై,  గుజరాత్‌లోని కచ్ చాలా దగ్గరగా ఉంటాయి. ఒకవేళ పాక్, భారత్ మధ్య యుద్ధమే వస్తే.. ముంబై, కచ్‌లను పాకిస్తాన్ మిస్సైళ్లతో లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అందుకే అరేబియా సముద్రంలో భారత నౌకాదళం తన యాక్టివిటీని పెంచింది.

Also Read :Maoists Hunting: 300 మంది మావోయిస్టుల దిగ్బంధం.. 5వేల మందితో భారీ ఆపరేషన్

సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ అంటే ?

గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌(India Vs Pak) కాసేపటి క్రితమే అరేబియా సముద్రంలో మిస్సైళ్లను టెస్ట్ చేసింది.  ఐఎన్ఎస్ సూరత్ నుంచి వదిలిన మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్.. గగనతలంలో నుంచి వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయి. దీనికి సంబంధించిన ఒక వీడియోను భారత నౌకాదళం విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో మిస్సైల్ ఛేదించిందని వెల్లడించింది.  సముద్ర మార్గంలో రాడార్లు ఉంటాయి. వాటిని తప్పించుకునేందుకు అతి తక్కువ ఎత్తు నుంచి శత్రుదేశం పాక్ డ్రోన్లు, క్షిపణులను సంధించే అవకాశం ఉంది. ఈ విధంగా తక్కువ ఎత్తు నుంచి వచ్చే డ్రోన్లు, మిస్సైళ్లను సీస్కిమ్మింగ్‌ టార్గెట్‌లు అంటారు. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, వివిధ రకాల మిలిటరీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి ఇలాంటి లక్ష్యాలను సమర్ధంగా ధ్వంసం చేయగలదు.

Also Read :Advanced Chat Privacy: వాట్సాప్‌లో ‘అడ్వాన్స్‌‌డ్ ఛాట్‌ ప్రైవసీ’ ఫీచర్‌.. ఏమిటిది ?

అరేబియా సముద్రంలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 

భారత నౌకాదళానికి చెందిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలు ఈవిషయాన్ని ధ్రువీకరించాయి. ప్రస్తుతం ఇది కర్ణాటకలోని కార్వార్‌ పోర్టు సమీపంలో గస్తీ కాస్తోంది.  కొన్ని వారాల ముందే అనుకొన్న ప్రణాళిక ప్రకారమే దీన్ని మోహరించారని సమాచారం.