Site icon HashtagU Telugu

Pak Sailors Rescued : 19 మంది పాక్ మత్స్యకారులను రక్షించిన ఇండియన్ నేవీ

Pak Sailors Rescued

Pak Sailors Rescued

Pak Sailors Rescued :ఇండియన్ నేవీ మరోసారి సత్తా చాటింది. రెండు రోజుల్లో రెండోసారి సోమాలియా సముద్రపు దొంగల ఆటను కట్టించింది. ఇరాన్ జెండాతో వెళ్తున్న మత్స్యకారుల ఓడ ‘ఎఫ్‌వీ అల్ నయీమి’ని సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.  11 మంది సాయుధ సముద్ర దొంగలు ఫిషింగ్ నౌకను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆ నౌక నుంచి ఎమర్జెన్సీ హెల్ప్  మెసేజ్ అందడంతో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర అలర్ట్ అయింది. సముద్రంలోని సంఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా యాంటీ పైరసీ ఆపరేషన్ నిర్వహించింది.  హైజాక్‌కు గురైన నౌకను భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర చుట్టుముట్టింది. వెంటనే లొంగిపోవాలని హైజాకర్లను హెచ్చరించింది. దీంతో వారు గత్యంతరం లేక మత్స్యకారుల ఓడ ‘ఎఫ్‌వీ అల్ నయీమి’ని భారత నేవీకి అప్పగించింది. ఈ  నౌకలో 19 మంది పాకిస్తానీ మత్స్యకారులు(Pak Sailors Rescued) ఉన్నారని గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకుముందు రోజు.. 

అంతకుముందు రోజే ఇరాన్ జెండాతో వెళ్తున్న ఫిషింగ్ నౌక ‘ఎఫ్‌వీ ఇమాన్’‌ను కూడా సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఆ వెంటనే  ఫిషింగ్ నౌక ‘ఎఫ్‌వీ ఇమాన్’‌ నుంచి భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రకు SOS కాల్‌ వచ్చింది. దీంతో మన వార్ షిప్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. ఫిషింగ్ నౌకలోని 17 మంది ఇరాన్ సిబ్బందిని రక్షించింది.

Also Read : Bill 252 : రెండు కప్‌ల టీ, రెండు బ్రెడ్ ముక్కలకే రూ.252 బిల్లు.. ఎక్కడ ?

అరేబియా సముద్రంలో లైబీరియా జెండాతో వెళ్తున్న  ఎంవీ లీలా నార్‌ఫోల్క్‌ నౌక జనవరి మొదటివారంలో హైజాక్ అయింది. నౌక హైజాక్‌కు గురైనట్లు సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై వెంటనే ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది.  ఈ  షిప్‌లోకి దిగిన భారత నేవీ కమాండోలు.. నౌకలోని 21 మంది సిబ్బందిని రక్షించారు. భారత నేవీ రక్షించిన వారిలో 15 మంది భారతీయులు ఉన్నారు. హైజాక్ కావడానికి ముందు ఈ నౌక బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వైపు ప్రయాణిస్తోంది. సోమాలియా తీర ప్రాంతం నుంచి 300 నాటికల్ మైళ్ల దూరంలో దీన్ని హైజాక్ చేశారు.హైజాక్ అయిన తర్వాత యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్‌‌కు మెసేజ్ వచ్చింది. ఐదు నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నౌకలోకి ప్రవేశించారని ఆ మెసేజ్‌లో ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, ఆర్మీకి చెందిన విభాగాలు వెంటనే స్పందించాయని భారతీయ నౌకాదళ అధికార ప్రతినిధి చెప్పారు. హైజాక్ అయిన నౌక నుంచి యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్‌కు మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత, ఈ సంఘటన గురించి భారతీయ నౌకాదళానికి సమాచారం అందిందని, వెంటనే పెట్రోలింగ్ టీమ్‌ను పంపించామని తెలిపారు.