Visakhapatnam: నేవిలో అందుబాటులోకి వచ్చిన ఫస్ట్ P15B గైడెడ్-క్షిపణి విధ్వంసక నౌక

మొదటి P15B గైడెడ్-క్షిపణి విధ్వంసక నౌక భారత నావికాదళంకి చేరింది.దీనిపై నేవి అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

  • Written By:
  • Updated On - November 1, 2021 / 11:25 AM IST

మొదటి P15B గైడెడ్-క్షిపణి విధ్వంసక నౌక భారత నావికాదళంకి చేరింది.దీనిపై నేవి అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. “విశాఖపట్నం “ అని పేరు పెట్టిన ఈ నౌక నిర్మాణం, డెలివరీ — స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ కార్యక్రమాలకు ప్రభుత్వం ,నావికాదళం అందించిన ప్రోత్సాహానికి మరో నిదర్శనమని పేర్కొంది.

ముంబైలోని మజాగాన్ డాక్లో 20 ఏప్రిల్ 2015 న ఈ నౌక నిర్మాణం ప్రారంభించారు. స్వదేశీ P15B స్టెల్త్ గైడెడ్-క్షిపణి విధ్వంసక విమానాలలో ఇది మొదటిది. అక్టోబర్ 28, 2021న విశాఖలో భారత నావికాదళానికి అందించబడిందనిభారత నౌకాదళం ట్విట్టర్లో పేర్కొంది.ఇది భారత నావికాదళం యొక్క పోరాట సంసిద్ధతను పెంపొందించడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ (స్వయం-ఆధారమైన భారతదేశం) కోసం తమ అన్వేషణలో ఒక పెద్ద ముందడుగు అవుతుంది అని పేర్కొంది.ముఖ్యంగా విశాఖపట్నం క్లాస్ షిప్లుగా పిలవబడే ప్రాజెక్ట్ 15B నాలుగు నౌకల కోసం ఒప్పందం 28 జనవరి 2011న సంతకం చేయబడింది. ఈ ప్రాజెక్ట్ గత దశాబ్దంలో ప్రారంభించబడిన కోల్కతా క్లాస్ (ప్రాజెక్ట్ 15A) డిస్ట్రాయర్లకు అనుసంధానమైంది.

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఈ యుద్ధనౌకను పూర్తిగా భారత ఉక్కుతో తయారు చేశారు. ఇది 163 మీటర్ల పొడవైన ఈ నౌక సుమారు 3000 టన్నుల బరువును కలిగి ఉంటుంది.ఇది నాలుగు గ్యాస్ టర్బైన్లతో నడుపబడుతుంది. సుమారు 7300 టన్నుల స్థానభ్రంశం వద్ద 30 నాటికల్ మైల్ పైగా గరిష్ట వేగాన్ని చేరగలదు. ఈ ఓడలు, రెండు బహుళ హెలికాప్టర్లను తీసుకునిపోయే మరియు నిర్వహించ గల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయిఇది అడ్వాన్స్ యాక్షన్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎఐఎస్), ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫాం మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐపిఎంఎస్), అధునాతన పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (పిడిఎస్) మరియు ఒక కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో సహా ఆధునిక ఆయుధాలతో బిగించి ఉంటుంది.ఇస్రాయెలీ మల్టీ-ఫంక్షన్ సర్వైలెన్స్ త్రెట్ అలెర్ట్ రాడార్ (MF-STAR) ను కూడా ఈ నౌకకు అమర్చారు. MF-STAR , యుద్ధనౌక మీద నుండి 32 బరాక్ 8 దీర్ఘ శ్రేణి ఉపరితలం నుంచి గగనతల క్షిపణుల గురికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.ఇది 8 బ్రహ్మోస్ క్షిపణులను మోసుకొనిపోవు సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.ఇది నాలుగు 30 mm శీఘ్ర తుపాకులను కలిగి ఉంటుంది ఇది నౌకకు దగ్గరలో రక్షణ సామర్ధ్యంను అందిస్తుంది మరియు సమర్థవంతంగా నావికా కాల్పుల మద్దతును అందించడానికి ఒక MR తుపాకీ కూడా ఉంటుంది.

ఫ్లోట్’ మరియు ‘మూవ్’ కేటగిరీలలోని అనేక స్వదేశీ పరికరాలతో పాటు, డిస్ట్రాయర్ కూడా ప్రధాన స్వదేశీ ఆయుధాలతో అమర్చబడింది

#మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ (BEL, బెంగళూరు).
#బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్ (బ్రహ్మోస్ ఏరోస్పేస్, న్యూఢిల్లీ).
#స్వదేశీ టార్పెడో ట్యూబ్ లాంచర్లు (లార్సెన్ & టూబ్రో, ముంబై).
#యాంటీ సబ్మెరైన్ స్వదేశీ రాకెట్ లాంచర్లు (లార్సెన్ & టూబ్రో, ముంబై).
#76mm సూపర్ రాపిడ్ గన్ మౌంట్ (BHEL, హరిద్వార్)