India Vs Kirana Hills: కిరానా హిల్స్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇది ఒక కొండ ప్రాంతం. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోడా జిల్లాలో ఉంది. ఈ కొండల్లో పాకిస్తాన్ ఆర్మీకి భారీ బంకర్లు ఉన్నాయి. ఈ బంకర్లలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను దాచారు. ఇటీవలే భారత సేనలు ప్రయోగించిన సుఖోయ్ 30, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిస్సైళ్లు వెళ్లి కిరానా హిల్స్‌లో ఉన్న ఒక బంకర్ వద్ద పేలాయట. దీంతో దడుసుకున్న పాకిస్తాన్ ఆర్మీ వెంటనే ఈవిషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పిందట. దీంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్(India Vs Kirana Hills) గుండెలు బాదుకుంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ కాల్ చేశారట.
Also Read :Terrorists Encounter : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే ఉగ్రవాది హతం.. మరో ముగ్గురి కోసం వేట
ఉగ్రవాదుల చేతుల్లోకి పాక్ అణ్వాయుధాలు
ఒకవేళ తమ అణ్వాయుధ స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేస్తే.. అవి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తాయని ట్రంప్‌కు షాబాజ్ షరీఫ్ చెప్పారట. దీంతో ఈవిషయంపై భారత ప్రభుత్వ వర్గాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడారట. అయితే కిరానా హిల్స్‌లో పాకిస్తాన్ అణుబాంబులు ఉన్న విషయం కూడా తమకు తెలియదని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయట. దీంతో మళ్లీ పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడిన ట్రంప్, జేడీ వాన్స్.. వెంటనే హాట్ లైన్‌లో భారత్‌తో మాట్లాడి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారట. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే మరో దారి లేదని.. షాబాజ్ షరీఫ్‌కు తేల్చి చెప్పారట.
Also Read :Death Facts : మనిషి చనిపోయినా.. ఈ అవయవాలు పనిచేస్తాయి తెలుసా ?
మరో దారి లేక.. కాల్పుల విరమణకు పాక్ అంగీకారం
దీంతో మే 10 మధ్యాహ్నం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ (డీజీఎంఓ) కాశిఫ్ అబ్దుల్లా నుంచి భారత డీజీఎంఓ రాజీవ్ ఘయ్‌కు హాట్ లైన్‌లో కాల్ వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకొని.. ఇరుదేశాల ప్రభుత్వాల సమ్మతి తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం మీద కిరానా హిల్స్‌లో పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పాకిస్తాన్ అణ్వాయుధాలను నిల్వ ఉంచే జకోకాబాద్‌తో పాటు రాడార్స్ హిట్, సుక్కూర్, పస్రూర్, సియాల్‌కోట్, స్కర్దు, చునియాన్ స్థావరాలపైనా భారత్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది.