Site icon HashtagU Telugu

Russia Ukraine War: ర‌ష్యాకు ఊహించ‌ని షాక్ ఇచ్చిన భార‌త్..!

India Russia

India Russia

ఉక్రెయిన్‌పై దండ‌యాత్ర కొన‌సాగిస్తున్న ర‌ష్యా పై అంత‌ర్జాతీయంగా ప్ర‌పంచ దేశాల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నా, ఇండియా మాత్రం ర‌ష్యాకు మ‌ద్ద‌తు ఇచ్చింది. అయితే ఇప్పుడు ర‌ష్యాపై ఆర్థిక ఆంక్ష‌లు తీవ్ర‌ముతున్న నేప‌ధ్యంలోర‌ష్యాను వ్య‌తిరేకిస్తున్న దేశాల‌లో భార‌త్ కూడా చేరిపోయింది. రెండు వారాలకు పైగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రష్యాపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఈ నేప‌ధ్యంలో పశ్చిమ దేశాలతో పాటు భారత్‌లో కూడా రష్యాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రష్యాలో కూడా ఇప్పటికే పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రష్యాకు ఊహించని షాక్ తగిలింది. అది కూడా ఇంత కాలంలో తటస్థంగా ఉన్న భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో స్వయంగా తాము నామినేట్ చేసిన జడ్డీ రష్యాకు షాక్ ఇచ్చారు.

అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తొలి నుంచి తటస్థంగానే ఉంటూ వ‌స్తుంది. అమెరికా, ఉత్తర కొరియా విషయంలో కానీ, రష్యా ఉక్రెయిన్ వ్యవహారంలో కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా భారత్ ఆచితూచి అడుగులు వేస్తూ వ‌చ్చింద‌ది. తటస్థ వైఖరిని అనుస‌రించిన భారత్ తొలి నుంచి రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూనే ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు భారత్ నిరాకరించింది. ఐక్య రాజ్య సమితితో పాటు అంతర్జాతీయ వేదికలపైన కూడా తటస్థంగా వ్యవహరించింది భార‌త్.

రష్యా, ఉక్రెయిన్ విషయంలో ఐరాస భద్రతా మండలి సహా పలు సమావేశాల్లో భారత్ ఇప్పటికే అభిప్రాయం చెప్పింది. అయితే ఓటింగ్ విషయంలో మాత్రం దూరంగానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ కోర్టులో మాత్రం రష్యాకు భారత్ షాక్ ఇచ్చింది. వాస్తవానికి అంతర్జాతీయ కోర్టులో తటస్థంగా ఉండాలని కేంద్ర ప్ర‌భుత్వం భావించ‌గా, భారత తరఫు న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ మాత్రం భారత్ ఆశలపై నీరు చల్లారు. ఉక్రెయిన్‌పై రష్యా వైఖరిని జస్టిస్ దల్వీర్ భండారి తప్పుబట్టారు.

ఇక తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చ‌ర్య‌కు పూనుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓటింగ్ నిర్వహించారు. అయితే కేంద్ర స‌ర్కార్‌ వైఖరికి భిన్నంగా ఐసీజేలో భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. వాస్తవానికి రష్యా, ఉక్రెయిన్ సమస్యపై జస్టిస్ దల్వీర్ భండారీ వివరణ పూర్తిగా ఆయన స్వతంత్ర చర్య అయినప్పటికీ, వివిధ అంతర్జాతీయ వేదికలపై మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే అవ‌కాశం ఉంది. ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్-రష్యా సమస్యపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది . యుద్ధానికి బదులుగా చర్చలపై దృష్టి పెట్టాలని, శత్రుత్వాలను ముగించాలని ఇరుపక్షాలను భారత్ గతంలో కోరిన విష‌యం తెలిసిందే.