Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

Apple - Indian Student : అవసరమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. అవసరమే ఆవిష్కరణలను సృష్టిస్తుంది.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ అస్మి జైన్ కు గొప్ప ఛాన్స్ లభించింది. 

  • Written By:
  • Updated On - May 31, 2023 / 02:58 PM IST

Apple – Indian Student : అవసరమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. 

అవసరమే ఆవిష్కరణలను సృష్టిస్తుంది.. 

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ అస్మి జైన్ కు గొప్ప ఛాన్స్ లభించింది. 

సరికొత్త హెల్త్‌కేర్ యాప్‌ను తయారు చేసినందుకుగానూ ఆమె “యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌”ను గెలుచుకుంది.

జూన్ 5 అమెరికాలోని యాపిల్ హెడ్ క్వార్టర్ లో స్టార్ట్ కానున్న Worldwide Developers Conference (WWDC)కు హాజరయ్యే ఛాన్స్ దక్కించుకుంది. 

ఆ యాప్ ఏంటి ? దాన్ని అస్మి జైన్ డెవలప్ చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది ?

అస్మి జైన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉన్న మెడి-క్యాప్స్ విశ్వవిద్యాలయంలో(Apple – Indian Student) చదువుతోంది. తన స్నేహితురాలి మామయ్య మెదడుకు సర్జరీ జరిగిన తర్వాత ఆమె వెళ్లి పరామర్శించింది. ఆయన కంటిచూపు స్థిరంగా ఉండకపోవడాన్ని.. ముఖ పక్షవాతంతో బాధపడుతున్న స్థితిని చూసి అస్మి జైన్ చలించిపోయింది. అప్పుడే.. అలాంటి వాళ్లకు ఉపయోగపడే యాప్ ను తయారు చేయాలనే ఐడియా ఆమెకు వచ్చింది. అనుకున్నదే తడవుగా.. యాపిల్ కంపెనీకి చెందిన స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్‌ ను ఉపయోగించి ఒక యాప్ ను తయారు చేసింది. అదే “ప్లే గ్రౌండ్ యాప్”.

Also read : Apple Store Features: ఇండియాలో మొదటి యాపిల్ స్టోర్ విశేషాలు తెలుసా..?

యాప్ స్పెషాలిటీ ఇదీ.. 

“ప్లే గ్రౌండ్ యాప్”ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే.. పక్షవాత సమస్యలు ఉన్నవాళ్లు మొబైల్ స్క్రీన్ చుట్టూ కదులుతున్న బంతిని ఫాలో అవుతుంటే వారి కంటి కదలికలను ట్రాక్ చేసే వీలు ఉంటుంది.  పక్షవాత సమస్యలు ఉన్నవారి కంటి కదలికలను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షణ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ వివరాలతో ఆమె “యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌”కు అప్లై చేసింది. దాని విన్నర్ల జాబితాలో తన పేరు కూడా ఉండటంతో  అస్మి జైన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అమెరికాకు చెందిన యెమీ అజెసిన్, నేపుల్స్‌కు చెందిన మార్టా మిచెల్ కాలిండో కూడా ఆపిల్ స్విఫ్ట్ ఛాలెంజ్‌ను ఈసారి గెలుచుకున్నారు. వీరు ముగ్గురూ జూన్ 5న ప్రారంభమయ్యే WWDC 2023 ఈవెంట్‌కు హాజరుకానున్నారు.