Site icon HashtagU Telugu

Drone Attack : ఇండియా జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ ఎటాక్

Us Predator Drone Deal

Us Predator Drone Deal

Drone Attack : భారత్‌కు చెందిన గుజరాత్ సముద్రతీరంలో ఇజ్రాయెల్ నౌకపై డ్రోన్ దాడి జరిగిన కొన్ని గంటలకే .. భారత జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌పైనా ఎటాక్ చోటుచేసుకుంది. అయితే ఈసారి దాడి ఎర్ర సముద్రంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం ఇండియా తీరంలోని అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్ నౌకపై డ్రోన్ ఎటాక్ అయింది. శనివారం రాత్రి 10.30 గంటల టైంలో ఇండియా జెండాతో ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న గబాన్ దేశ ఆయిల్ ట్యాంకర్‌పైనా యెమన్ హౌతీలు డ్రోన్‌ను సంధించారు. డ్రోన్ వచ్చి ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే నౌకలోని సిబ్బంది సమీపంలో ఉన్న అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ లబూన్‌కు ఎమర్జెన్సీ మెసేజ్ పంపారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో వెంటనే అమెరికా యుద్ధ నౌక అలర్ట్ అయి సంఘటనా స్థలానికి వెళ్లింది. దాడికి గురైన ఆయిల్ ట్యాంకర్ పేరు M/V సాయిబాబా అని అమెరికా ఆర్మీ వెల్లడించింది. M/V బ్లామనెన్ అనే నార్వే జెండా కలిగిన  కెమికల్ ట్యాంకర్‌పైకి కూడా యెమన్ హౌతీలు డ్రోన్‌ను సంధించగా.. కొంచెంలో మిస్సయిందని తెలిపింది. అంతకుముందు తమ యుద్ధనౌక వైపుగా యెమన్ హౌతీలు ప్రయోగించిన నాలుగు డ్రోన్లను తాము కూల్చేశామని(Drone Attack) అమెరికా వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర దాడులను ఆపాలని కోరుతూ ఎర్ర సముద్రంలో రాకపోకలు సాగించే నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై యెమన్ హౌతీలు దాడులు చేస్తున్నారు. వీరికి ఇరాన్ సపోర్ట్ ఉంది.

Also Read: Whats Today : స్వేదపత్రంపై కేటీఆర్ ప్రజెంటేషన్.. కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ సమావేశం

అక్టోబర్ 17 నుంచి ఇప్పటివరకు యెమన్ హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై 15 దాడులు చేశారని అమెరికా మిలిటరీ తెలిపింది. శనివారం మధ్యాహ్నం ఇండియా సముద్ర తీరంలో ఇజ్రాయెలీ నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఇరాన్ పనేనని ఆరోపించింది. అయితే ఇలాంటి ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. యెమన్ హౌతీలు వారి సొంత బలంపైనే ఈ పోరాటం చేస్తున్నారని స్పష్టం చేస్తోంది.