Site icon HashtagU Telugu

Operation Kagar : కర్రెగుట్ట కొండ పై త్రివర్ణ పతాకం

Security Forces Take Contro

Security Forces Take Contro

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో నక్సల్స్ ఆధీనంలో ఉన్న కర్రెగుట్ట కొండ(Karregutta )ను భద్రతా బలగాలు (Security forces) విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ విజయాన్ని గుర్తుగా కొండపై భారత త్రివర్ణ పతాకాన్ని (Indian flag)ఎగురవేశారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో ఇది ఒక కీలక ఘట్టంగా మారింది. భద్రతా బలగాల శౌర్యం, వ్యూహాత్మక ప్రణాళికల ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. ఈ ఫోటోలను అధికారిక వర్గాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తమ సైనికుల ధైర్యాన్ని ప్రజలకు తెలియజేశారు.

ఈ ఆపరేషన్‌ను భద్రతా బలగాలు గత వారం ప్రారంభించాయి. బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరిన ఈ ఆపరేషన్‌లో సుమారు 24,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్ డ్రాప్‌ ద్వారా కమాండోలు కర్రెగుట్టపైకి చేరుకొని ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మరియు కోబ్రా కమాండోలు పాల్గొన్నారు. భద్రతా బలగాల వ్యూహం ఫలితంగా ఈ ప్రాంతంలోని సుమారు 2,000 సాయుధ నక్సలైట్లు ఫందాలో చిక్కుకున్నట్టు సమాచారం.

MIC Electronics Limited : అంతర్జాతీయ ప్రమాణపత్రాలను అందుకున్న MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్

కర్రెగుట్ట కొండ 5,000 అడుగుల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతం కావడంతో ఆపరేషన్‌ నిర్వహించడం సవాలుగా మారింది. పైగా అక్కడి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం సిబ్బందికి మరింత కష్టతరంగా మారింది. అయినా కూడా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ భద్రతా బలగాల సమిష్టి కృషితో ఆ ప్రాంతాన్ని నక్సల్స్ నుంచి స్వచ్ఛం చేయగలిగారు. ఈ విజయంతో భద్రతా బలగాలు నక్సల్స్ ఏరివేతలో మరింత ముందడుగు వేసినట్లయింది.