India: అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి

  • Written By:
  • Publish Date - February 25, 2024 / 06:57 PM IST

India: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పై సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై భారత్‌ స్పందించింది. ఈ మేరకు అమెరికా కోర్టు తీర్పు పై భారత రాయబార కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సీటెల్‌ సిటీ అటార్నీ తీర్పుపై రివ్యూ కోరింది.సీటెల్ పోలీసు అధికారి పై నేరారోపణలను ఎత్తివేసిన అమెరికా కోర్టు తీర్పును సమీక్షించాలని భారత్ కోరింది.

జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొంది. కేసు పురోగతిపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కౌంటీ అటార్నీ రివ్యూ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈమేరకు రాయబార కార్యాలయం తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది.