Site icon HashtagU Telugu

Pakistan Spy – Satendra : పాక్ గూఢచారిగా మారిన ఇండియన్ ఎంబసీ ఉద్యోగి

Pakistan Spy Satendra

Pakistan Spy Satendra

Pakistan Spy – Satendra : దేశద్రోహం అంటే ఇదే. అతగాడి పేరు సతేంద్ర సివాల్‌. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లా షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందినవాడు. రష్యాలోని మాస్కోలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) గా పనిచేసేవాడు. ఓ వైపు ఈ కీలకమైన జాబ్ చేస్తూనే.. మరోవైపు అతడు మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో జరిగే మీటింగ్‌ల వివరాలన్నీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి సీక్రెట్‌గా పంపేవాడు. ఈబండారం బట్టబయలు కావడంతో అతగాడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. సతేంద్ర సివాల్‌ను విచారణ కోసం మీరట్‌లో ఉన్న  యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఫీల్డ్ యూనిట్‌కు అప్పగించారు. ఇప్పటిదాకా జరిగిన విచారణలో అతడు(Pakistan Spy – Satendra ) కీలకమైన వివరాలను చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. అయితే పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్టు ఒప్పుకున్నాడు. సతేంద్ర సివాల్ 2021 సంవత్సరం నుంచి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్ (IBSA)గా పనిచేస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join

పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ(ISI) హ్యాండ్లర్లు భారత విదేశాంగ శాఖ ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని, భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తామని ఆశచూపుతున్నారని భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.  దీనిపై దర్యాప్తు చేసే క్రమంలోనే మాస్కోలోని భారత ఎంబసీలో పనిచేస్తున్న సతేంద్ర సివాల్‌ పాక్ గూఢచారిగా మారిన విషయం వెలుగుచూసింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఉన్న రహస్య పత్రాలను దొంగిలించి అతడు పాక్‌కు పంపేవాడని విచారణలో తెలిసింది. డబ్బు కోసం అత్యాశపడి అతడు దేశద్రోహం చేశాడని సంబంధిత వర్గాలు చెప్పాయి.

Also Read :Irfan Pathan Wife : తొలిసారి భార్య ఫొటోను షేర్ చేసిన ఇర్ఫాన్.. సఫా బేగ్ ఎవరు ?

లాభ్‌శంకర్ మహేశ్వరి.. పాక్ గూఢచారి

పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చే హిందువులకు పౌరసత్వం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈనేపథ్యంలో పాక్ నుంచి భారత్‌కు వచ్చి పౌరసత్వం తీసుకున్న  ఒక హిందువు పాక్ గూఢచారిలా పనిచేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. 1999లో మెడికల్ ట్రీట్‌మెంట్‌ కోసం పాక్ నుంచి భారత్‌కు వచ్చిన లాభ్‌శంకర్ మహేశ్వరి.. గుజరాత్‌లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తారాపూర్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక కిరాణా దుకాణం పెట్టుకుని ఇక్కడే భారత పౌరసత్వం కోసం 2002 లో దరఖాస్తు చేసుకోగా.. 2005 లో లభించింది. 55 ఏళ్ల లాభ్‌శంకర్ మహేశ్వరి ఆనంద్ జిల్లాలోని తపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. లాభ్‌శంకర్ మహేశ్వరి తరచూ పాక్ ఐఎస్ఐతో టచ్‌లో ఉండేవాడని గుర్తించారు. తన వాట్సాప్ నంబర్ నుంచి గుజరాత్‌లోని ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులకు డేంజరస్ మాల్‌వేర్‌ వైరస్ ఉండే మెసేజ్ లింకులను పంపించేవాడని పోలీసులు గుర్తించారు. సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఆ లింక్‌ను ఓపెన్ చేయగానే.. ఆ సెల్‌ఫోన్‌లలో ఉన్న సమాచారం మొత్తం హ్యాకర్లకు చేరుతుంది. ఫోన్‌లో ఎంత సమాచారం ఉన్నా చిన్న ఏపీకే ఫైల్‌ రూపంలోకి మార్చి తక్కువ డాటా ఉన్నా ఆ ఫైల్‌ను హ్యాకర్లకు అందిస్తుంది.