Site icon HashtagU Telugu

Iran : ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Indian citizens should avoid unnecessary travel to Iran.. Central Govt

Indian citizens should avoid unnecessary travel to Iran.. Central Govt

Iran and Israel War: ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. యుద్ధ ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది కేంద్రం. భారత పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరపాలని పేర్కొంది.

Read Also:Musi Demolition : బీజేపీ కార్యచరణ రేపు ప్రకటిస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాగా, గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో కూడా వరల్డ్ వార్ 3 అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. త్వరలో ఇరాన్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

జెరుసలెంలోని అధికారుల భద్రతా కేబినేట్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడి విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అలాగే ఈ సమయంలో తమకు అండగా నిలిచిన అమెరికాకు నేతన్యూహు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇదిలాఉండగా ఇటీవల ఇజ్రయెల్ చేసిన దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది జులైలో హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హనియే కూడా మరణించారు. ఇలా పలువురు కీలక వ్యక్తుల్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అయినప్పటికీ గాజా, లెబనాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లెబనాన్‌లో వాకీటాకీలు, పేజర్లు పేలిన ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా కూడా మరణించడంతో ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడింది.

Read Also:Konda Surekha : కొండా సురేఖ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలంటూ హరీష్ రావు డిమాండ్