Site icon HashtagU Telugu

Indian Army: పాకిస్తాన్ దాడుల వివరాలతో ‘ఎక్స్‌’లో భారత ఆర్మీ పోస్ట్

Indian Army Pakistan Army Attacks India Vs Pakistan

Indian Army: భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతిగా పాకిస్తాన్ కవ్వింపులకు దిగుతోంది. గురువారం రోజు రాత్రి పాకిస్తాన్ ఏమేం చేసింది ? ఎలాంటి దాడులు చేసింది ? వాటికి భారత సేనలు ఎలా స్పందించాయి ? అనే వివరాలతో భారత ఆర్మీ  ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.

‘‘గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పాకిస్తాన్ ఆర్మీ భారతదేశ పశ్చిమ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. జమ్మూకశ్మీరు పరిధిలో పలుచోట్ల చొరబాటుకు యత్నించింది. పాకిస్తాన్ సైన్యం చేసిన ఈ దుశ్చర్యలను భారత సైన్యం బలంగా తిప్పికొట్టింది. సాంబా జిల్లా సరిహద్దు వద్ద అతిపెద్ద చొరబాటును బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అడ్డుకుంది. సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై పాక్‌ డ్రోన్లు(Indian Army) దాడికి యత్నించాయి. వాటిని భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పంజాబ్‌లో పలు ప్రాంతాలపై పాకిస్తాన్ ఎటాక్స్‌కు పాల్పడింది. వాటికి మేం బలమైన జవాబిచ్చాం.పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాక్‌కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేశాం. జలంధర్‌లోకి చొరబడిన పాకిస్తాన్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. పంజాబ్‌లోని భటిండాలో పాకిస్తాన్ డ్రోన్లను భారత ఆర్మీ  కూల్చేసింది’’  అని పేర్కొంటూ భారత ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత సరిహద్దులను సురక్షితంగా, శత్రు దుర్బేధ్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ ఎక్స్ పోస్ట్‌తో పాటు భారత ఆర్మీ ఒక వీడియోను అటాచ్ చేసింది. యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లతో పాకిస్తాన్ సైనిక పోస్ట్‌లను భారత ఆర్మీ ధ్వంసం చేస్తున్న సీన్లు అందులో ఉన్నాయి. భారత దాడిలో పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ కుప్పకూలడం అందులో స్పష్టంగా కనిపించిది. అయితే పాక్‌లోని ఏ లొకేషన్‌లో ఉన్న ఆర్మీ పోస్ట్‌ను భారత్ కూల్చేసిందనే వివరాలు తెలియరాలేదు.

Also Read :Operation Sindoor : భారత్, పాక్ ఉద్రిక్తల్లో జోక్యం చేసుకోం – జేడీ వాన్స్

ఇక గురువారం రాత్రి  రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఆర్మీ స్టేషన్‌పై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి పాక్ యత్నించింది. భారత గగనతల  రక్షణ వ్యవస్థ వాటిని పేల్చేసింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్ నగరంపైకి పాక్ డ్రోన్లు, మిసైల్స్ రాగా, వాటిని భారత సైన్యం నిర్వీర్యం చేసింది. అక్కడ పాకిస్తానీ డ్రోన్లను భారత సైన్యం నిర్వీర్యం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తానీ డ్రోన్లు, మిస్సైళ్లు ఆకాశంలోనే పేలిపోవడం సదరు వీడియోల్లో స్పష్టంగా రికార్డయింది. సైరెన్లు మోగడం వినిపించింది. నగరమంతా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.

Also Read :Vaishakh Purnima 2025: పేదరికం వెంటాడుతోందా.. వైశాఖ పౌర్ణమి రోజున దీపంతో ఈ పరిహారం చేయాల్సిందే!