16 jawans killed: సిక్కీంలో ఘోరం.. లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు, 16 మంది జవాన్లు మృతి!

నార్త్ సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత సైనికులు (Indian Army) 16 మంది చనిపోయారు.

Published By: HashtagU Telugu Desk
16 jawans killed

Army

మనదేశంలోని ఉత్తర సిక్కీం (Sikkim)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి (Indian Army) చెందిన ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు,  13 మంది సైనికులతో సహా 16 మంది జవాన్లు ట్రక్కు (Vehicle)లో ప్రయాణిస్తున్నారు. శుక్రవారం వారు ప్రయాణిస్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. దీంతో సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర సిక్కింలోని జెమాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ వాహనం మూడు వాహనాల కాన్వాయ్‌లో ఒకటి. ఉదయం చటెన్ నుండి థంగు వైపుకు వెళ్లింది. జెమా వద్ద మార్గంలో ట్రక్కు టర్న్ అవుతుండగా, అక్కడే రోడ్డు నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో ఒక్కసారి లోయలోకి పడిపోయింది ట్రక్కు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు సైనికులను (Indian Army) ఆస్పత్రికి తరలించినట్టు ఆర్మీ తెలిపింది.

జవాన్ల మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. “ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది (Indian Army) ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి సేవ, నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని రక్షణ మంత్రి ట్వీట్ చేశారు.

Also Read: Kangana Ranaut: అలాంటి డబ్బు నాకొద్దు.. కంగనా కామెంట్స్!

  Last Updated: 23 Dec 2022, 04:37 PM IST