India Attack Plan : పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై సర్‌ప్రైజ్ ఎటాక్ చేయడానికి భారత్ అనూహ్య ప్లాన్‌ను రెడీ చేసింది. భారత్ నుంచి కాకుండా.. తజకిస్తాన్ దేశం నుంచి భారత యుద్ధ విమానాలు వెళ్లి పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఎటాక్ చేస్తాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్‌పై ఈ సైనిక ఆపరేషన్‌ను చేపట్టేందుకు తజకిస్తాన్‌లో ఉన్న ఆయనీ వైమానిక స్థావరాన్ని భారత్ వాడుకోనుంది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)కు, దక్షిణ తజకిస్తాన్ ప్రాంతానికి మధ్య ఎవరికీ చెందని భూభాగం ఉంది. దీన్ని వఖాన్ కారిడార్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం మీదుగా పీఓకేలోకి భారత వాయుసేన యుద్ధ విమానాలు వెళ్తాయని అంచనా వేస్తున్నారు. పైలట్లకు ముప్పు కలగకుండా మానవరహిత విమానాలతో ఈ ఎటాక్ చేయించాలని భారత వాయుసేన భావిస్తోందట.
Also Read :War Plan : యుద్ధ సన్నద్ధతపై కేంద్రం సమీక్ష.. పాక్ ఎక్కడ దాడులు చేయొచ్చు ?
పీఓకేకు చేరువలో ఆయనీ..
ఇప్పటికే భారత్‌కు(India Attack Plan) చెందిన కొన్ని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానాలు ఆయనీ వైమానిక స్థావరంలో ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం దీన్ని భారత్, తజకిస్తాన్ సైన్యాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. విదేశాల్లో భారతదేశ తొలి వైమానిక స్థావరంగా ఆయనీ ఎయిర్‌బేస్ గుర్తింపు పొందింది. పాకిస్తాన్‌పై నిఘాకు, అవసరమైతే వైమానిక దాడికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఆయనీ వైమానిక స్థావరం పాకిస్తాన్‌లోని పెషావర్‌కు 500 కిలోమీటర్లు, ఇస్లామాబాద్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ వైమానిక స్థావరం.. భారత్‌దేనా ?
తజకిస్తాన్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఆయనీ అనే గ్రామం ఉంది. అక్కడ శిథిలావస్థలో ఉన్న గిస్సార్ సైనిక ఏరోడ్రోమ్‌ను ఆనాటి వాజ్‌పేయీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. దీని రన్‌వేను 3,200 మీటర్లకు పొడిగించారు. ఈ పనుల్లో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవాలు అప్పట్లో కీలక పాత్ర పోషించారు. గిస్సార్ సైనిక ఏరోడ్రోమ్ అనేది ఆయనీ గ్రామంలో ఉన్నందున, దాన్ని ఆయనీ వైమానిక స్థావరం అని పిలుస్తారు. ఇది ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యుద్ధ విమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి అనుకూలంగా ఆయనీ వైమానిక స్థావరం ఉంది. అక్కడ విమానాల మరమ్మతులకు హ్యాంగర్లు, ఓవర్‌హాలింగ్ కేంద్రాలు, ఇంధన నింపే సౌకర్యాలనూ భారత్ అప్పట్లోనే ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆనాడు దాదాపు 10 కోట్ల డాలర్లను భారత్ ఖర్చు చేసింది.