భారతదేశంలో త్వరలోనే సరికొత్త రూ.50 నోట్లు (Indian 50 Rupee Note) చలామణిలోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నోట్ల విడుదలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇటీవల ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా సంతకం గల కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి.
Local Body Elections : తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా..?
ఈ కొత్త రూ.50 నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌లో భాగంగా రానున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. నోట్ల రూపకల్పనలో ఎలాంటి మార్పులు ఉన్నాయన్న విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కొత్త నోట్ల రూపం, భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. కొత్త నోట్ల విడుదలకు సంబంధించి ఆర్బీఐ ఇప్పటికే చట్టపరమైన అనుమతులను పొందింది. వినియోగదారులు, వ్యాపారులు కొత్త నోట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చినా, ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.50 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త నోట్ల ప్రవేశం సాధారణ ప్రక్రియగా భావించబడుతుంది. గతంలో కూడా రిజర్వ్ బ్యాంక్ వివిధ ధ్రువుపత్రాల నోట్లను కొత్త రూపంలో విడుదల చేసింది. తాజా మార్పులు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవని అధికారులు తెలిపారు. కొత్త రూ.50 నోట్ల మార్కెట్లోకి రాకతో, అవి ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి భద్రతా ఫీచర్లు కలిగి ఉంటాయన్న ఆసక్తి పెరిగింది.
