Operation Kaveri: విజయవంతమైన “ఆపరేషన్ కావేరీ”.. సూడాన్ నుంచి భారత్ చేరుకున్న 3800 మంది ఇండియ‌న్స్..!

సుడాన్ (Sudan)లో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడానికి ఆపరేషన్ కావేరీ (Operation Kaveri) తీవ్రతరం కావడంతో భారతదేశం దాదాపు 3800 మంది భారతీయ పౌరులను (Indians) యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్ నుండి విజయవంతంగా ఖాళీ చేయించింది.

Published By: HashtagU Telugu Desk
Operation Kaveri

Resizeimagesize (1280 X 720)

సుడాన్ (Sudan)లో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడానికి ఆపరేషన్ కావేరీ (Operation Kaveri) తీవ్రతరం కావడంతో భారతదేశం దాదాపు 3800 మంది భారతీయ పౌరులను (Indians) యుద్ధంలో దెబ్బతిన్న సూడాన్ నుండి విజయవంతంగా ఖాళీ చేయించింది. ఆపరేషన్ కావేరీ (Operation Kaveri) కింద సూడాన్ నుండి ఇప్పటివరకు సుమారు 3800 మందిని రక్షించారు. గురువారం తెల్లవారుజామున సూడాన్‌లో చిక్కుకుపోయిన 192 మంది భారతీయులు అహ్మదాబాద్ చేరుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన సీ17 విమానంలో పోర్ట్ సూడాన్ నుంచి అహ్మదాబాద్ గుజరాత్‌కు తీసుకొచ్చారు.

సుడాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ఆపరేషన్ కావేరీ కింద ఇప్పటివరకు మొత్తం 3,584 మంది భారతీయులను సంఘర్షణతో కూడిన సూడాన్ నుండి తరలించారు. ఈ ఆపరేషన్ కి గురువారంతో తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. భారత నావికాదళానికి చెందిన ఐదు నౌకలు, వైమానిక దళానికి చెందిన 16 విమానాలను ఆపరేషన్ కావేరీలో ఉపయోగించారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి 16 మంది భారతీయుల బ్యాచ్ గురువారం లక్నోకు బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. దీనికి ముందు 14 మంది భారతీయులు జెడ్డా నుండి మరో విమానంలో ముంబైకి బయలుదేరారని ఆయన చెప్పారు. 192 మంది ప్రయాణికులతో కూడిన మరో బ్యాచ్ పోర్ట్ సూడాన్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి-17 విమానం ద్వారా అర్థరాత్రి అహ్మదాబాద్ చేరుకుంది.

Also Read: Whatsapp Loan: వాట్సప్ ద్వారా లోన్ పొందవచ్చు.. జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు..

Also Read: Revanth Reddy: సీఎంఓలో మహారాష్ట్ర ఎంప్లాయ్ ఏంటిది కేసీఆర్: రేవంత్

40,000 మంది సూడాన్ పౌరులు తమ భూభాగంలోకి ప్రవేశించారని ఈజిప్ట్ పేర్కొంది. మరికొందరు చాద్, దక్షిణ సూడాన్, ఇథియోపియాలకు వెళ్లారు. విద్యుత్, నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆహారం, ఇంధనం కొరత ఉంది. చాలా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఇటువంటి పరిస్థితిలో వారికి పారిపోవడం తప్ప మరో మార్గం లేదు.

సూడాన్‌లో కాల్పుల విరమణను మే 11 వరకు పొడిగించటాన్ని అక్కడి అధికారులు అంగీకరించారు. అయితే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ఇప్పటివరకు 528 మంది పౌరులు మరణించగా, 4,599 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులకు సురక్షితమైన మార్గం, సహాయ సామగ్రిని అందించడానికి రెండు వైపుల నుండి అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా నిబంధనలు ఉల్లంఘించారని ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ప్రజలు బలవంతంగా వలస వెళ్లాల్సి వస్తోంది.

  Last Updated: 06 May 2023, 06:05 AM IST