PM Modi Warning : భారత త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపితే, గట్టిగా బదులివ్వాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ‘‘పాకిస్తాన్ వాళ్లు ఒక్క తూటా పేలిస్తే, మీరు షెల్స్ తో కౌంటర్ ఇవ్వండి.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే మేం ఎటాక్ చేస్తాం. వాళ్లు ఎటాక్ చేస్తే.. మేం మళ్లీ ఎటాక్ చేస్తాం’’ అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
Also Read :Gold From Lead : సీసాన్ని బంగారంగా మార్చేసే టెక్నాలజీ.. సైంటిస్టుల సక్సెస్
ఉగ్రవాద చర్యకు పాల్పడితే ఊరుకోం
భారత్ – పాకిస్తాన్ కాల్పుల విరమణ అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇటీవలే చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా జేడీ వాన్స్‌కు మోడీ ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్పారట. ‘‘భవిష్యత్తులో భారతగడ్డపై పాకిస్తాన్ ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే మేం ఊరుకోం. అది తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేం బలంగా ప్రతిస్పందిస్తాం’’ అని జేడీ వాన్స్‌కు మోడీ(PM Modi Warning) తేల్చి చెప్పారంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనాన్ని ప్రచురించింది.
మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు
పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే.. పీఓకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాకిస్తాన్‌కు మరో మార్గం లేదు. పీఓకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్ చేయడంపై మాత్రమే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతాం. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు’’ అని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు మోడీ తేల్చి చెప్పారు. జేడీ వాన్స్‌కు మోడీ ఈవిషయాన్ని స్పష్టం చేసిన రోజు రాత్రే(శుక్రవారం అర్ధరాత్రి).. భారత్‌లోని 26 ప్రదేశాలపై పాకిస్తాన్ దాడికి దిగింది. ఈ దాడికి ప్రతిస్పందనగా వెంటనే (శనివారం ఉదయం) పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై భారత్ ప్రతిదాడులు చేసింది. భారత్ దాడులను పాకిస్తాన్ నిలువరించలేకపోయింది. పాకిస్తాన్ దాడులను భారత్ సులభంగా అడ్డుకోగలిగింది. సైనిక సంపత్తి, సాంకేతిక విలువలను సమతుల్యంగా వినియోగించడంలో భారత్ చాలా ముందంజలో ఉందని ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలతో నిరూపితమైంది.
Also Read :Ambanis Mango Empire: రిలయన్స్ మామిడి సామ్రాజ్యం.. 600 ఎకరాల్లో 1.30 లక్షల మ్యాంగో ట్రీస్
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలు
పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపులకు బలమైన జవాబివ్వాలని ఆర్మీకి ప్రధాని మోడీ నిర్దేశించారు. ఈనేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన చేశారు. మే 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్తాన్ ఆర్మీకి దీటైన జవాబిచ్చేందుకు భారత ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాలను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సమీక్షా సమావేశం
ఈరోజు(ఆదివారం) భారత్‌లోని పశ్చిమ సరిహద్దు ప్రాంతాల ఆర్మీ కమాండర్లతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మే 10న రాత్రి నుంచి మే 11న తెల్లవారుజాము వరకు పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాక్ సైన్యం భారత గగనతలంలోకి చొరబడింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. ఈ అంశాలపై ఈరోజు సమీక్షా సమావేశంలో చర్చించారు.