India Vs Pakistan : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాకిచ్చారు. ట్రంప్ వల్ల భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందనే ప్రచారంలో నిజం లేదన్నారు. భారత్, పాక్‌లు జరుపుకున్న ద్వైపాక్షిక చర్చల వల్లే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్ఓఎస్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Powerful Nuclear Missile: పవర్ ఫుల్ అణు క్షిపణి ‘మినిట్ మ్యాన్-3’.. పరీక్షించిన అమెరికా.. ఎందుకు ?
అమెరికా ఫోన్ కాల్స్‌కు భారత్ సమాధానమిదీ..
‘‘అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో(India Vs Pakistan) నాకు ఫోన్ కాల్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధానమంత్రి మోదీకి కాల్ చేసి మాట్లాడారు. అమెరికాలాగే గల్ఫ్‌లోని కొన్ని దేశాలు కూడా భారత్‌ను సంప్రదించాయి. రెండు దేశాలు ఘర్షణలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు ఫోన్ చేసి ఆందోళనను తెలియజేయడం అనేది సాధారణ విషయమే’’ అని జైశంకర్ వివరించారు. ‘‘పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ గురించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌తో ప్రస్తావించినప్పుడు.. మేం ఒక విషయాన్ని వాళ్లకు తేల్చి చెప్పాం. నేరుగా పాకిస్తానే భారత్‌తో మాట్లాడాలని స్పష్టం చేశాం. ఆ తర్వాత స్వయంగా పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత డీజీఎంఓకు కాల్పుల విరమణపై రిక్వెస్ట్ వచ్చింది. మేం అందుకు అంగీకారం తెలిపాం’’ అని ఆయన చెప్పుకొచ్చారు. కాల్పుల విరమణ అనేది భారతదేశం, పాకిస్తాన్ మధ్య నేరుగా జరిగిన ఒప్పందమని జైశంకర్ తేల్చి చెప్పారు.
Also Read :Street Vendors : వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు.. రూ.80వేల దాకా క్రెడిట్ లిమిట్ ?
మే 10న భారత్ ఏం చేసిందంటే..
‘‘మే 10న ఉదయం భారత్‌పై పాక్ దాడి చేసింది. మేం వెంటనే పాకిస్తాన్‌లోని 8 వైమానిక స్థావరాలపై ఎటాక్ చేశాం. వాటి రన్‌వేలను ధ్వంసం చేశాం. కమాండ్ సెంటర్‌లను కూలగొట్టాం. ఆ వెంటనే పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ప్రతిపాదనతో మా వద్దకు వచ్చింది’’ అని జైశంకర్ తెలిపారు.ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పహల్గాం తరహాలో మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని, ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఎక్కడున్నా వేటాడి మరీ దాడి చేస్తుందన్నారు.