Submarine Missile : మిస్సైల్ టెక్నాలజీని పెంచుకోవడంపై భారత్ ఫోకస్ పెంచింది. సముద్ర జలాల లోపల ఉంటూ పహారా కాసే జలాంతర్గాములు (సబ్ మెరైన్స్) భారత ఆర్మీ వద్ద ఉన్నాయి. ఈ జలాంతర్గాములు ఇక రెక్కలు తొడగనున్నాయి. ఎలా అంటే.. జలాంతర్గామి నుంచి ప్రయోగిం చేందుకు వీలయ్యే లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డెవలప్ చేసింది. ఈ సబ్ మెరైన్ క్రూయిజ్ మిస్సైల్(Submarine Missile) 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
మార్చి మొదటివారంలో..
మార్చి మొదటివారంలో మన దేశంలోని తూర్పు తీరం వద్ద ఈ అధునాతన సబ్‌మెరైన్ లాంచ్డ్ క్రూయిజ్ మిస్సైల్ (SLCM)ను భారత్ టెస్ట్ చేయనుంది. వాస్తవానికి ఈ మిస్సైల్‌ను పరీక్షించడం ఇది రెండోసారి. గతేడాది ఫిబ్రవరిలో కూడా ఒకసారి ఈ SLCM క్షిపణిని టెస్ట్ చేశారు. 2019 సంవత్సరంలో భారత్ టెస్ట్ చేసిన నిర్భయ్ మిస్సైల్ తరహాలోనే SLCM మిస్సైల్ కూడా అన్ని రకాల సామర్థ్యాలను కలిగి ఉంటుందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
సబ్‌మెరైన్ లాంచ్డ్ క్రూయిజ్ క్షిపణిని ‘ప్రాజెక్ట్ 75 ఇండియా’ కింద భారత నౌకాదళం, డీఆర్డీవో కలిసి నిర్మించాయి. ఇది పూర్తిగా దేశీయ టెక్నాలజీతో తయారు చేసిన జలాంతర్గామి. రక్షణ దళాల క్రూయిజ్ క్షిపణులతో పాటు షార్ట్ అండ్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే రాకెట్ ఫోర్స్‌లో భాగం కానున్నాయి. SLCM తరహా క్షిపణులు ఇప్పటికే చైనా, పాకిస్తాన్ వద్ద కూడా ఉన్నాయి. భారత్ వద్ద బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ క్షిపణులు సైతం ఉన్నాయి. 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను సైతం ఇవి ఛేదించగలవు.
Also Read : Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 28 జాబ్స్
సౌదీకి ఇండియా బ్రహ్మోస్
సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ‘వరల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పో’లో భారతదేశం తన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రదర్శించింది. ఆసక్తి కలిగిన దేశాలకు బ్రహ్మోస్‌ను విక్రయించేందుకు భారత్ రెడీ అయింది. భారత్ నుంచి బ్రహ్మోస్‌ను కొనేందుకు సౌదీ అరేబియా రెడీగా ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సౌదీతో భారత్ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రపంచంలోనే మిస్సైల్ టెక్నాలజీలో శక్తివంతమైన దేశంగా అవతరిస్తోంది. అది ఏకంగా రష్యాకు మిస్సైళ్లను సప్లై చేసే స్థాయికి ఎదిగింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా.. ఆయుధాల కొరతను ఎదుర్కొన్న టైంలో దానికి చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలే సాయం చేశాయని అంటున్నారు.