పాక్ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లను (Apache Helicopters) మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అత్యాధునిక రణరంగ సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్లు సరిహద్దుల్లో పటిష్టమైన గగన భద్రతను కల్పించనున్నాయి. ముందుగా అమెరికా నుంచి మూడు హెలికాప్టర్లు ఈ నెలలో భారత్‌కు రానుండగా, మిగతా మూడింటిని ఏడాది చివర్లో అందించనున్నారు.
Asian Paints: టీవీ స్టార్స్‌తో ప్రమోషన్.. ఏషియన్ పెయింట్స్ మెగా ప్లాన్!
2020లో భారత్–అమెరికా మధ్య 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. దీనికి దాదాపు $600 మిలియన్ డాలర్లు ఖర్చవుతోంది. మొదటగా 2024 మార్చికి ముందుగా వీటి డెలివరీ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించగా, కొంతకాలం వాయిదా పడింది. కానీ ప్రస్తుతం హెలికాప్టర్లను అందించే ప్రక్రియ వేగవంతం చేయడంతో భారత వాయుసేనకు ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే భారత్ వద్ద 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. కొత్తగా వచ్చే ఆరు అపాచీలు ప్రాధాన్య భద్రతా ప్రాంతాల్లో వినియోగించనున్నట్లు సమాచారం.
AH-64E అపాచీ హెలికాప్టర్లు నైట్ విజన్, మిసైల్ టార్గెటింగ్, హెవీ ఫైరింగ్ సామర్థ్యం కలిగి ఉండటంతో శత్రు దేశ చొరబాట్లకు గట్టి చెక్ పడనుంది. ఇవి భూమి మీద గల లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటంతో, సరిహద్దు దళాలకు మరింత ఆధునిక హోదా లభించనుంది. పాకిస్తాన్‌తో పాటు ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది. కొత్త అపాచీలు భారత భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, అమెరికా–భారత్ మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి.