Site icon HashtagU Telugu

Israel Attack: ఇజ్రాయెల్‌ నుంచి భారతీయ విద్యార్థులను రప్పించే ప్రయత్నాలు

Israel Attack (1)

Israel Attack (1)

Israel Attack: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. ఇజ్రాయెల్‌లోని భారతీయుల గురించి గత రాత్రి తనకు చాలా సందేశాలు వచ్చాయని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తోందని, ఆ దేశంలో చిక్కుకున్న మన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆమె తెలిపారు.

భారతీయ విద్యార్థులు మరియు మేఘాలయ నుండి తీర్థయాత్ర కోసం జెరూసలేంకు వెళ్లిన 27 మంది బెత్లెహెమ్‌లో చిక్కుకున్నారు. మేఘాలయ సిఎం కాన్రాడ్ కె. సంగ్మా ఎక్స్‌లో పవిత్ర తీర్థయాత్ర కోసం జెరూసలేంకు ప్రయాణించిన 27 మంది మేఘాలయా పౌరులు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఉద్రిక్తత కారణంగా బెత్లెహెమ్‌లో చిక్కుకున్నారు అని రాశారు. వారు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు నేను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నానని సంగ్మా చెప్పారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు ఉన్నారు, వీరిలో ఎక్కువ మంది వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులు మరియు విద్యార్థులు ఉన్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

హమాస్ జరిపిన దాడిలో దాదాపు 350 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, 1,000 మందికి పైగా గాయపడ్డారు.ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో 230 మంది పాలస్తీనియన్లు మరణించారు మరియు 1,500 మందికి పైగా గాయపడ్డారు. హమాస్ 5,000 రాకెట్లను ప్రయోగించినట్లు నివేదించబడింది.

Also Read: World Cup 2023: ప్రపంచ కప్ లో భారత్ బోణి.. ఆసీస్ చిత్తు