Site icon HashtagU Telugu

CDS Anil Chauhan In IISS: భారత్ సొంతంగా నిలదొక్కుకుంటే, పాకిస్తాన్ చైనా పై ఆధారపడింది…

Cds Anil Chauhan In Iiss

Cds Anil Chauhan In Iiss

CDS Anil Chauhan In IISS: భారతదేశం అభివృద్ధి చేసుకున్న రక్షణ వ్యవస్థల ద్వారానే “ఆపరేషన్‌ సిందూర్‌” నిర్వహించామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్ తెలిపారు. శనివారం సింగపూర్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (International Institute For Strategic Studies – IISS) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

చైనా ఆధారపడిన పాకిస్తాన్

చౌహాన్ మాట్లాడుతూ – ‘‘పాకిస్తాన్‌ స్వంత రక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉండటంతో చైనా పై ఆధారపడింది. కానీ భారత్ మాత్రం ఆకాశ్ వంటి స్వదేశీ రక్షణ వ్యవస్థలను ఉపయోగించింది. స్పేస్‌, శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. మేము మా సొంత శాటిలైట్ వనరులను వినియోగించి ఉగ్ర శిబిరాలపై సమర్థవంతంగా దాడులు చేశాం. అప్పుడు పాకిస్తాన్ విదేశీ శాటిలైట్ చిత్రాలపై ఆధారపడింది. అవి ఎవరిచే అందించబడ్డాయో స్పష్టంగా తెలియకపోయినా, వారి మిత్రదేశాల నుంచే వచ్చి ఉండవచ్చని అంచనా’’ వేస్తున్నామని అన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ – రక్షణలో ఆటోమేషన్ కీలకం

‘‘భారతదేశం ఇప్పుడు ఆధునిక రక్షణ వ్యవస్థల్లో స్వయం సమర్థత సాధిస్తోంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ఫలితం. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, పెద్ద పరిశ్రమలు ఇప్పుడు రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదే భారతదేశం యొక్క గొప్ప బలం. యుద్ధం జరిగినప్పుడు నష్టాలు తప్పవు. కానీ ప్రతి ద్వందిపై మన స్పందన, ఎంత వేగంగా, ఎలా స్పందించామన్నదే అసలైన విషయం. మేము మూడు రోజుల్లో ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేయగలిగాం. పౌరులపై ఎలాంటి నష్టం లేకుండా దీనిని అమలు చేశాం,’’ అని వివరించారు.

భారతం యుద్ధం కోరదు, కానీ అప్రమత్తంగా ఉంటుంది

చౌహాన్ మాట్లాడుతూ – ‘‘భారతదేశం దీర్ఘకాలిక యుద్ధాల వైపు పోదు. ఎందుకంటే అవి అభివృద్ధి పరపతి మందగించిస్తాయి. అయితే, ఆటోమేషన్ వంటి అంశాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్షణ రంగంలో ఇది భవిష్యత్‌ మార్గం.’’