Predator Drones : అమెరికా నుంచి 31 ‘ఎంక్యూ9బీ సాయుధ ప్రిడేటర్’ డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.29వేల కోట్లు. ఈ ఒప్పందంపై భారత్, అమెరికాలు సంతకాలు చేశాయి. మొత్తం 31 ఎంక్యూ9బీ డ్రోన్లలో 15 భారత నౌకాదళానికి, 8 భారత సైన్యానికి అందుతాయి. మరో 8 డ్రోన్లను భారత వాయుసేనకు కేటాయిస్తారు. నాలుగు హెల్‌ఫైర్ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లే కెపాసిటీ ఎంక్యూ9బీ డ్రోన్ల సొంతం.
Also Read :600 Bank Jobs : 600 బ్యాంకు జాబ్స్.. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక
ఈ డ్రోన్లలో వినియోగించే మిస్సైళ్లు, లేజర్ గైడెడ్ బాంబులను జనరల్ అటామిక్స్ సంస్థ సమకూరుస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఎంక్యూ9బీ డ్రోన్ల పనితీరును స్వయంగా రాజ్‌నాథ్ పరిశీలించారు. ఎక్కువ ఎత్తులో.. దాదాపు 40 గంటలకుపైగా గాల్లో ఎగరడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. మన దేశం ఇప్పటికే సీగార్డియన్ డ్రోన్లను వాడుతోంది. ఈ డ్రోన్లను కూడా జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి భారత్ లీజుపై(Predator Drones) తీసుకుంది.ఈ ఏడాది జనవరిలోనే వీటి లీజు గడువు ముగిసింది. దీంతో సీగార్డియన్ డ్రోన్ల లీజు కాంట్రాక్టును మరో నాలుగేళ్లపాటు పొడిగించారు.
Also Read :Supreme Court : కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
పదేపదే కూల్చేసిన యెమన్ హౌతీలు
చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ‘ఎంక్యూ9బీ సాయుధ ప్రిడేటర్’ డ్రోన్లను భారత్ కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి ఈ డ్రోన్లను కూడా కూల్చేయొచ్చని ఇటీవలే పలుమార్లు యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు నిరూపించారు. గత కొన్ని నెలల వ్యవధిలో యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లపై దాడుల కోసం అమెరికా నౌకాదళం ఈ డ్రోన్లను వాడింది. ఎర్ర సముద్రంలో హౌతీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఎంక్యూ9బీ సాయుధ ప్రిడేటర్’ డ్రోన్లను అమెరికా మోహరించింది. అయితే చాలాసార్లు హౌతీలు వాటిని విజయవంతంగా కూల్చేశారు. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలే అందుకు నిదర్శనం. అమెరికా రక్షణశాఖ అధికారులు సైతం ఈ ఘటనలను నిర్ధారించారు. ఇంత కాస్ట్లీ డ్రోన్లను యెమన్ హౌతీలు అవలీలగా కూల్చేయడంపై అంతటా చర్చ నడిచింది.