Site icon HashtagU Telugu

Covid : భారత్‌కి మరో కోవిడ్‌ వ్యాప్తి సిద్దంగా ఉండాలి..!

Covid Alert

Covid Alert

Covid: మరో కోవిడ్‌ వ్యాప్తికి భారత్‌ సిద్ధంగా ఉండాలని యూఎస్‌ సెండటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) నిపుణుడు శుక్రవారం హెచ్చరించారు. అయితే అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం.. యూఎస్‌లో దేశంలోని 25 రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో కూడా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా గణాంకాల ప్రకారం.. జూన్ 24 మరియు జూలై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీ వారం సగటున 17,358 కోవిడ్ నమూనాలను పరీక్షించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం భారత్‌లో కూడా 908 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్-జూలై మధ్య రెండు మరణాలు సంభవించాయి. ఇతర దేశాల మారిగానే భారత్‌లో పరిస్థితి తీవ్రంగా లేనప్పటికీ మనం దీనికి సిద్ధంగా ఉండాలని నోయిడాలోని శివ్ నాడార్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ దీపప్ సెహగల్ చెప్పారు. వైరస్ ఖచ్చితంగా తిరిగి పుంజుకుందని, ఈ వైరస్ సంభవించిన వారిలో 26 శాతం మరణాలు, 11 శాతం పెరుగుదల ఉందని డబ్ల్యూహెచ్ఓ నివేదించింది. ఇది ఆందోళనకరమైన విషయమని అన్నారు.

ఇటీవల వ్యాప్తిలో KP వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓమిక్రాన్ వంశానికి చెందినది. ఓమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు రోగనిరోధక శక్తిని తప్పించుకునే లక్షణం ఉంది. జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ జేఎన్.1 నుంచి KP.2 వేరియంట్ పుట్టుకొచ్చినట్లు గుర్తించారు. భారతదేశంలో కేపీ.2 మొదటిసారిగా డిసెంబర్ 2023 ఒడిశాలో కనుగొన్నారు.

Read Also: Study : ఊబకాయం 3 మరణాలలో 2 గుండె జబ్బులతో ముడిపడి ఉన్నాయి

కేపీ.2 జాతి ఓమిక్రాన్ వేరియంట్ నుంచి స్పైక్ రీజియన్‌లో మూడు మ్యూటేషన్లను కలిగి ఉంది. INSACOG (ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) నుండి వచ్చిన డేటా, ఈ వేరియంట్ ఇప్పటికే భారతదేశంలో ఉందని చూపింది. KP.x — ఇందులో KP.3.1.1 మరియు FLiRT వేరియంట్ లేదా KP.2 వంటి దానికి సంబంధించి జాతులు ఉన్నాయి. జూలై చివరి వారంలో సేకరించిన భారతదేశంలోని మొత్తం కోవిడ్ సీక్వెన్స్ శాంపిల్స్‌లో దాదాపు 39 శాతం ఉన్నాయి. ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ డాష్ బోర్డులో భారత్ లోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలను చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 279 యాక్టివ్ కేసులు8 ఉన్నాయి. JN.1 ఓమిక్రాన్ నుంచి ఉద్భవించిన KP.1 మరియు KP.2 జాతులు భారతదేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతాయి.

Read Also: Ear Phones: గంటల తరబడి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!

Exit mobile version