President Murmu: భారత్ ను టీబీ రహితంగా మార్చాలి: రాష్ట్రపతి ముర్ము

President Murmu: కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనదేశం క్షయవ్యాధి (TB) నుండి విముక్తి పొందుతుందని అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.  శుక్రవారం, మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, టిబి గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో  ‘ప్రపంచ క్షయ దినోత్సవం’ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైానా ఉందని” అని రాష్ట్రపతి తన […]

Published By: HashtagU Telugu Desk

President Draupadi Murmu

President Murmu: కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనదేశం క్షయవ్యాధి (TB) నుండి విముక్తి పొందుతుందని అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.  శుక్రవారం, మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, టిబి గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో  ‘ప్రపంచ క్షయ దినోత్సవం’ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైానా ఉందని” అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.

TB  ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాధిని నియంత్రించడంలో సవాళ్ల గురించి అవగాహన పెంచడం భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.  భారతదేశం 2025 నాటికి TBని నిర్మూలించడానికి కట్టుబడి ఉందన్నారు. 2030 ప్రపంచ లక్ష్యం కంటే ఐదు సంవత్సరాలు ముందుగా. 2.8 మిలియన్ల TB కేసులతో బాధపడుతున్నారని అన్నారు. టీబీని ముందస్తుగా గుర్తించడం, చికిత్స చేయడం మరియు నివారించడం వంటి వాటి ప్రాముఖ్యతను కూడా రాష్ట్రపతి నొక్కి చెప్పారు. “భారతదేశాన్ని టిబి రహితంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని నేను కోరుతున్నానన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి’’ అని ఆమె పేర్కొంది.

  Last Updated: 23 Mar 2024, 05:43 PM IST