Site icon HashtagU Telugu

India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

India- Russia

India- Russia

India- Russia: భారతదేశం- పొరుగు దేశం చైనా మధ్య మరో కొత్త వివాదం తలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. రేర్ ఎర్త్ లోహాలు (Rare Earth Metals), శాశ్వత అయస్కాంతాల (Permanent Magnets) సరఫరాపై చైనా మరింత నియంత్రణ విధించింది. భారతదేశం తన అవసరాలలో దాదాపు 65 శాతం రేర్ ఎర్త్ లోహాలను చైనా నుండే దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిస్థితిలో భారతదేశం చైనాపై అధికంగా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఒక సానుకూల వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం భారతీయ కంపెనీలు రష్యాలో (India- Russia) అవకాశాలను అన్వేషించడం ప్రారంభించాయి.

ఓ నివేదిక ప్రకారం.. దీనికి సంబంధించి భారత్- రష్యాల మధ్య ప్రాథమిక దశ చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేయాలనుకుంటోంది. అందుకే విదేశీ దిగుమతులకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం దాదాపు 2270 టన్నుల రేర్ ఎర్త్ లోహాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంది.

Also Read: Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఏ కంపెనీలు రష్యాతో చర్చలు జరుపుతాయి?

కేంద్ర ప్రభుత్వం తరపున రష్యాతో చర్చలు జరపడానికి లోహమ్, మిడ్‌వెస్ట్ (Midwest) కంపెనీలను ఎంపిక చేశారు. ఈ రెండు కంపెనీలు రష్యాలోని ఖనిజ సంబంధిత కంపెనీలతో కలిసి భారతదేశం కోసం కొత్త అవకాశాలను అన్వేషించే పని చేస్తాయి. మీడియా నివేదికల ప్రకారం.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ధన్‌బాద్), ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (భువనేశ్వర్)లకు రష్యా కంపెనీల సాంకేతికతలను అర్థం చేసుకోవడానికి, మొత్తం ప్రాసెసింగ్ సమాచారాన్ని సేకరించడానికి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ భాగస్వామ్యంలో రష్యా తరపున నోర్నికెల్ (Nornickel), రోసాటమ్ (Rosatom) కంపెనీలకు అవకాశం లభించే అవకాశం ఉంది. ఈ రెండూ రష్యా ప్రభుత్వ రంగ సంస్థలే.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌పై చైనా దాదాపు 90 శాతం నియంత్రణ కలిగి ఉంది. అంటే ప్రపంచంలో దాదాపు పూర్తిగా చైనానే రేర్ ఎర్త్‌ను ఎగుమతి చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం రష్యా గత కొన్ని సంవత్సరాలలో రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ సాంకేతికతలపై చాలా కృషి చేసింది. భారతదేశంతో కలిసి ఈ సాంకేతికతలను వాణిజ్య రూపం ఇవ్వాలని రష్యా ముందుకు యోచిస్తోంది. ఇది సాధ్యమైతే రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ ప్రపంచంలో భారత్- రష్యా రెండు కొత్త పేర్లవుతాయి. దీని వల్ల చైనాపై ఆధారపడటం తగ్గడమే కాకుండా ఎగుమతులకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.

కొద్ది రోజుల క్రితం రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ (REPM) ఉత్పత్తి కోసం రూ. 7,350 కోట్ల కొత్త పథకాన్ని ప్రారంభించడం గురించి కూడా భారత ప్రభుత్వం చర్చించింది. భారతదేశంలో రేర్ ఎర్త్ ఉత్పత్తిని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.

Exit mobile version