Wheat Ban: గోధుమల ఎగుమతిపై నిషేధం…వాటికి మాత్రమే షిప్పింగ్ అనుమతి..!!

గోధుమల ఎగుమతిపై కేంద్ర సర్కార్ బ్యాన్ విధించింది.తక్షణమే ఆ నిషేధం అమల్లోకి రానుంది.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 11:57 AM IST

గోధుమల ఎగుమతిపై కేంద్ర సర్కార్ బ్యాన్ విధించింది. తక్షణమే ఆ నిషేధం అమల్లోకి రానుంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వరకు ఎగుమతి కోసం క్రెడిట్ లెటర్ జారీ చేసే వాటికి మాత్రమే షిప్పింగ్ కు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతోంది.

ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన గోధుమ నిల్వలను రష్యా అడ్డుకుంటోంది. దీంతో అనేక దేశాలకు గోధమల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈయూ దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడుతోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల గోధుమ ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ఇరు దేశాలు యుద్ధంలో ఉన్న కారణంగా గోధుమలకు డిమాండ్ భారీగా పెరిగింది.