Site icon HashtagU Telugu

Corona Report: భయపెడుతున్న కరోనా.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు!

India Corona

India Corona

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం వెయ్యిలోపు ఉన్న కేసులు ఒక్కసారిగా 2 వేలు దాటేశాయి. తాజాగా భారతదేశంలో గత 24 గంటల్లో 2,151 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 44.8 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 530,848 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, కర్ణాటకలో 806 యాక్టివ్ కేసులు, కేరళలో 2877 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2343 యాక్టివ్ కేసులు, గుజరాత్‌లో 1976 కేసులు, ఢిల్లీలో 671 కేసులు, తమిళనాడులో 660 యాక్టివ్ కేసులు వెలుగుచూశాయి. హిమాచల్ ప్రదేశ్ 574 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు XBB.1.16 కోవిడ్-19 వేరియంట్ కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రభుత్వం సూచించింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలనూ ఇప్ప‌టికే అలెర్ట్ చేసింది. మరోవైపు ఫ్లూ కేసులు కూడా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది. ఏప్రిల్ 10,11 వ తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించనుంది.

Also read: Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే