Site icon HashtagU Telugu

India Post : తపాలా శాఖ కీలక నిర్ణయం.. రిజిస్టర్డ్‌ పోస్టు స్థానంలో స్పీడ్‌ పోస్టు విధానం..

India Post

India Post

India Post : దేశంలో డాకా పంపిణీలో ఓ సుదీర్ఘ చరిత్ర కలిగిన రిజిస్టర్డ్‌ పోస్టు సేవలను తపాలా శాఖ త్వరలోనే పూర్తిగా విరమించనుంది. బ్రిటిష్ కాలం నుంచే ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రిజిస్టర్డ్‌ పోస్టును సెప్టెంబరు 1వ తేదీ నుంచి స్పీడ్‌ పోస్టు సేవల్లో విలీనం చేయనుంది. ఈ మేరకు భారత తపాలా శాఖ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా డాకా సేవల్లో నూతన మార్పులు తెచ్చే దిశగా ఈ చర్య తీసుకుంటోంది. వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు, ప్రతి పార్సల్‌ను తేలికగా ట్రాక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు రిజిస్టర్డ్‌ పోస్టును స్పీడ్‌ పోస్టులో కలిపివేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల అన్ని ముఖ్యమైన సేవలు ఒకే గడచి కిందకు చేరుతాయని తపాలా శాఖ భావిస్తోంది.

Uttarakhand : వైద్య నిర్లక్ష్యంతో ఏడాది పసివాడి మరణం..ఐదు ఆసుపత్రులు, రెండు రోజుల ప్రయాణం, చివరకు విషాదాంతం

ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని తపాలా సర్కిళ్లకు చెందిన మెయిల్‌ ఆపరేషన్‌ విభాగాలకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై అవసరమైన చోట “రిజిస్టర్డ్‌ పోస్టు” అనే పదాన్ని “స్పీడ్‌ పోస్టు” పదంతో భర్తీ చేయాలని, లేదంటే పూర్తిగా తొలగించాలని సూచించింది.

ఈ మార్పుతో పాటు, తపాలా సేవలలో ప్రామాణికత, విశ్వసనీయత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న కొన్ని లీగల్‌ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు వంటి అంశాలు ఇకపై స్పీడ్‌ పోస్టు ద్వారా పంపబడనున్నాయి. ట్రాకింగ్‌ సదుపాయంతో పాటు వేగవంతమైన డెలివరీ వల్ల వినియోగదారులకు మరింత అనుకూలత లభించనుంది.

తపాలా శాఖ తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయం పోస్టల్‌ వ్యవస్థలో కీలక మలుపుగా నిలవనుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్టర్డ్‌ పోస్టు సేవలను ఎక్కువగా వినియోగించే ప్రజలకు ఈ మార్పు ప్రభావం పడనుంది. అయితే స్పీడ్‌ పోస్టు సేవలు మరింత అభివృద్ధి చెందుతూ ప్రజలకు మరింత నమ్మకదాయకంగా మారితే, ఈ నిర్ణయం శుభప్రదంగానే మారే అవకాశం ఉంది.

August 1st : ఈ నెలలో మారిన రూల్స్..కొత్త వచ్చిన వచ్చిన రూల్స్ ఇవే ..!!!

Exit mobile version