Bunkers In Borders: భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో యావత్ దేశం అలర్ట్ అయింది. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని ప్రజలు మాత్రం హైఅలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ యుద్ధం ప్రభావం అత్యధికంగా పడబోయేది అక్కడి ప్రజలపైనే. పాకిస్తాన్ బార్డర్‌లోనే ఉండటంతో భారత్ – పాక్ యుద్ధం వల్ల అక్కడి ప్రజానీకం ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారు. దీంతోపాటు పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై భారత వాయుసేన దాడిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో రాబోయే కొన్ని నెలల పాటు కాల్పుల మోత కంటిన్యూ అవుతుంది. ఇదంతా జమ్మూకశ్మీర్ ప్రజలకు బాగా తెలుసు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులను, ఉద్రిక్తతలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం అక్కడి ప్రజానీకానికి ఉంది. అందుకే వారు తమ అనుభవంతో రాబోయే యుద్ధ కాలాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Also Read :Indian Spy Sehmat : 1971 వార్‌లో భారత్‌ను గెలిపించిన ‘రా’ ఏజెంట్.. సెహ్మత్ విశేషాలివీ
జమ్మూకశ్మీరు ప్రజలు అనుభవంతో..
1971లో భారత్ – పాక్ యుద్ధం వేళ అప్పట్లో జమ్మూకశ్మీరులో(Bunkers In Borders) వేలాది కుటుంబాలు తమ ఇళ్ల పరిసరాల్లో రహస్య బంకర్లను నిర్మించుకున్నారు. కార్గిల్ యుద్దం టైంలో మరిన్ని కశ్మీరీ కుటుంబాలు బంకర్లను తయారు చేసుకున్నాయి. ఈసారి కూడా పెద్ద యుద్ధమే జరుగుతుందనే భయాల నడుమ.. వందలాది కశ్మీరీ కుటుంబాలు రహస్య బంకర్ల నిర్మాణాన్ని మొదలుపెట్టాయి. ఈ పనులను కొందరు కాంట్రాక్టర్లకు అప్పజెప్పాయి. ఒక్కో బంకర్‌ను రెండు వారాల్లోనే నిర్మిస్తున్నారు. ప్రతీ బంకర్‌లో రెండు గదులు, ఒక టాయిలెట్, ఒక డైనింగ్ హాల్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సగటున 50 మంది కూర్చునేలా ఈ బంకర్లు ఉంటాయని కాంట్రాక్టర్లు అంటున్నారు.
Also Read :AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మళ్లీ ఆ పథకం అమల్లోకి.. ఉపయోగాలు ఏమిటంటే..?
బలంగా బంకర్ల నిర్మాణం..
పెద్ద బాంబులు పడినా కూలిపోకుండా బలంగా బంకర్లను కడుతున్నామని వారు తెలిపారు. బంకర్ల నిర్మాణానికి ఆర్‌సీసీ మెటీరియల్, బలమైన ఉక్కును వాడుతున్నారు. అందుకే అవి స్ట్రాంగ్‌గా నిలుస్తాయి.జమ్మూకశ్మీరుతో పాటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని గ్రామాలు కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలు కూడా బంకర్లను నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నారు.