Site icon HashtagU Telugu

భార‌త్ లో సివిల్ వార్‌: కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్‌

Ashok Gehlot

Ashok Gehlot

దేశంలో కులం మతం పేరుతో ద్వేషం వ్యాపించిందని, దానిని తనిఖీ చేయకపోతే అంతర్యుద్ధానికి దారితీస్తుందనిరాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,570 కి.మీల ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాహుల్ గాంధీ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యేందుకు పార్టీ శ్రేణులు అనుకూలంగా ఉన్నాయ‌ని అన్నారు.

దేశం ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని, రాహుల్ గాంధీ పార్టీ అధినేతగా వస్తే వాటిని ఎదుర్కోవడం సులువవుతుందని గెహ్లాట్‌ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా దేశంలో ద్వేషం, ఉద్రిక్తత, హింస అనే వాతావరణం ఏర్పడినందున ‘భారత్ జోడో’ నినాదం ఇవ్వాల్సిన అవసరం వ‌చ్చింద‌న్నారు.

ప్రజల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వం, సామరస్యం ఉండాలని, హింసను సహించబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హెచ్చ‌రించారు. కులం, మతం పేరుతో భార‌త్ లో అస‌హ‌నం సృష్టించారు, దీన్ని నియంత్రించకపోతే అంతర్యుద్ధం దిశగా పయనించే ప్రమాదం ఉంది’’ అని రాజ‌స్థాన్ సీఎం గెహ్లాట్ అన్నారు.