INDIA Meeting : క‌న్వీన‌ర్ ను తేల్చ‌లేని ఇండియా! ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌కు క‌మిటీ!!

ఇండియా కూట‌మి (INDIA Meeting) వేగంగా అడుగులు వేస్తోంది. ముంబాయ్ లో జరిగిన స‌మావేశంలో 13తో కూడిన క‌మిటీని వేస్తూ తీర్మానం చేసింది.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 03:56 PM IST

ఇండియా కూట‌మి (INDIA Meeting) వేగంగా అడుగులు వేస్తోంది. ముంబాయ్ లో జరిగిన స‌మావేశంలో 13తో కూడిన క‌మిటీని వేస్తూ తీర్మానం చేసింది. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌ను ర‌చించ‌డానికి ఆ క‌మిటీ క‌స‌ర్తత్తు చేస్తోంది. ఇప్ప‌టికే పాట్నా, బెంగుళూరు కేంద్రంగా రెండు స‌మావేశాలు జ‌రిగాయి. మూడో స‌మావేశం ముంబాయ్ లో శుక్ర‌వారం ముగిసింది. అయితే, కూట‌మి క‌న్వీన‌ర్, కో క‌న్వీన‌ర్ ఇత‌ర‌త్రా ప‌ద‌వుల విష‌యంలో ఏకాభిప్రాయానికి రాలేక‌పోయింది. ప్ర‌స్తుతానికి 13మందితో కూడిన క‌మిటీకి కామ‌న్ మినిమం ప్రోగ్రామ్ త‌యారు చేసే బాధ్య‌త‌ను అప్ప‌గించింది.

ఎన్నికల  థీమ్ “జుడేగా భారత్, జీతేగా ఇండియా(INDIA Meeting) 

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్    (INDIA Meeting) అధికారిక సమావేశం ముంబైలో ముగిసింది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని ప్రతిపక్ష కూటమి I.N.D.I.A శుక్రవారం తీర్మానించింది. సీటు షేరింగ్ ఏర్పాట్లను ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో వీలైనంత త్వరగా ముగుస్తుందని తెలిపింది. ఆ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికల కోసం దాని థీమ్ “జుడేగా భారత్, జీతేగా ఇండియా, (భారతదేశం ఏకం అవుతుంది, భారతదేశం గెలుస్తుంది)” అని పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించాల‌ని తీర్మానించింది. ప్ర‌ధాన‌ సమస్యలపై దేశంలోని వివిధ ప్రాంతాలలో వీలైనంత త్వరగా కూట‌మి బహిరంగ స‌భ‌లు, ర్యాలీలు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. జూన్ 23న పాట్నాలో ఉమ్మడి ప్రతిపక్షం తొలి సమావేశం కాగా, జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో రెండో సమావేశం జరగడం గమనార్హం. ఇక మూడో స‌మావేశం సెప్టెంబ‌ర్ 1న ముంబైలో ఫ‌ల‌ప్ర‌దంగా ముగిసింది.

13 మంది ప్ర‌తినిధుల‌ ఉమ్మ‌డి ప్ర‌ణాళిక ర‌చ‌న బాధ్య‌త‌

మొత్తం 28 పార్టీల ప్ర‌తినిధులు 68 మంది ముంబై విప‌క్ష కూట‌మి ఇండియా (INDIA Meeting) భేటీకి హాజ‌రు అయ్యాయి. ఆయా పార్టీల నుంచి 13 మంది ప్ర‌తినిధుల‌ను ఎంపిక చేసిన ఉమ్మ‌డి ప్ర‌ణాళిక ర‌చ‌న బాధ్య‌త‌ను అప్ప‌గిస్తూ కీల‌క తీర్మానం చేసింది.సెప్టెంబర్ 30 నాటికి సీట్ల షేరింగ్ గురించి కో ఆర్డినేష‌న్ క‌మిటీ ద్వారా అభ్య‌ర్థుల ఖరారు ఉంటుంద‌ని సంకేతాలు ఇచ్చింది.ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించడం అనివార్య‌త‌ను డిఎంకె అధ్యక్షుడు MK స్టాలిన్ వివ‌రించారు. ఇండియా కూటమి కోసం ఒక సమన్వయ కమిటీ అవ‌స‌రాన్ని త‌న ప్ర‌సంగంలో స్టాలిన్ వివ‌రించారు. బిజెపి దేశాన్ని అనేక విధాలుగా ఎలా నాశనం చేసిందో వివ‌రిస్తూ చేసిన బిజెపి ప్రభుత్వ తప్పులను ఎలా సరిదిద్దాలి? అనే కోణం నుంచి ఆయ‌న మాట్లాడారు. లోక్‌సభకు రానున్న ఎన్నికలలో ఇండియా కూట‌మి సంయుక్తంగా పోటీ చేయాలని తీర్మానం చేయ‌డం హైలెట్ పాయింట్ .

Also Read : Pakistan vs India: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా చూడొచ్చు..!

ఇండియా కూట‌మిలోని పార్టీలు మీడియా వ్యూహాలు, ప్రచారాలను జుడేగా అనే థీమ్‌తో సమన్వయం చేయాలని సంక‌ల్పించింది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అవకాశాలను అన్వేషించడానికి ప్రభుత్వం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇదంతా దేశ ప్ర‌జ‌లపై బీజేపీ ఆడుతోన్న గేమ్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి జిమ్మిక్కులు ఇక ప‌నిచేయ‌వ‌ని స‌మావేశంలో పేర్కొన్నారు. మోడీ స‌ర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింద‌ని అన్నారు. గ‌త రెండు స‌మావేశాల‌తో బీజేపీ భ‌య‌ప‌డింద‌ని చెప్పుకొచ్చారు.

Also Read : TCongress: టీకాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్న నేతలు

“ఒక దేశం, ఒకే ఎన్నికలు” యొక్క సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికలను రాష్ట్ర అసెంబ్లీ పోటీల తంతుతో నిర్వహించే అవకాశం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎను ఓడించేందుకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు సమావేశమైన విప‌క్ష కూటమి నేతల గ్రూప్ ఫోటోను ట్యాగ్ చేస్తూ, ఖర్గే ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. “జుడేగా భారత్, జీతేగా ఇండియా. మేము ప్రగతిశీలత కోసం ఐక్యంగా ఉన్నాము, సంక్షేమ-ఆధారిత, కలుపుకొని ఉన్న భారతదేశం.”140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది” అని ఖర్గే అన్నారు.

మోడీ స‌ర్కార్ సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ‌ల‌ను ఉప‌యోగిస్తుంద‌ని (INDIA Meeting) 

మూడో స‌మావేశం ముగిసిన త‌రువాత విప‌క్ష కూట‌మిలోని పార్టీల అధిప‌తులు, కీల‌క లీడ‌ర్ల మీద కేంద్ర ఎజెన్సీల దాడులు ఉంటాయ‌ని ఇండియా కూట‌మి అభిప్రాయ‌ప‌డింది. పార్టీల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి మోడీ స‌ర్కార్ సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ‌ల‌ను ఉప‌యోగిస్తుంద‌ని అన్నారు. వాటికి భ‌య‌ప‌డ‌కుండా ముందుకు నడ‌వాల‌ని ఏఐసీపీ అధ్య‌క్షుడు ఖ‌ర్గే పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే మ‌రో స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం ద్వారా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక పై ఏకాభిప్రాయానికి వ‌చ్చేలా 13 మంది తో కూడిన క‌మిటీను ప్ర‌క‌టించారు. అయితే, ఇండియా కూట‌మి లోగోను ఆవిష్క‌రిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ దానిపై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. అలాగే, ఇండియా కూట‌మి (INDIA Meeting) క‌న్వీన‌ర్, కో క‌న్వీన‌ర్ ల‌ను ప్ర‌క‌టించ‌కుండా స‌మావేశం ముగియ‌డం గ‌మనార్హం.