Site icon HashtagU Telugu

PM Modi : హఠాత్తుగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి మోడీ.. కీలక సందేశం

Pm Modi With Soldiers Adampur Airbase Punjab India Pakistan

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకస్మాత్తుగా పంజాబ్‌ రాష్ట్రంలోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి వెళ్లారు. మంగళవారం ఉదయాన్నే ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలో ఉన్న భారత వాయుసేన సిబ్బందితో మోడీ ముచ్చటించారు. ‘ఆపరేషన్‌ సిందూర్’ టైంలో ఆ ఎయిర్‌ బేస్ పరిధిలో చోటుచేసుకున్న ఘటనల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా సదరు వివరాలను మోడీకి వాయుసేన సిబ్బంది వివరించారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలోనే భారత ప్రధానమంత్రి మోడీ దాదాపు గంటన్నరకుపైగా గడిపారు. ఈ ఎయిర్ బేస్‌ను భారత ప్రధాని  సందర్శించడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే.. ఈ నెల 9, 10 తేదీల్లో ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడిచేశామని, అక్కడున్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని పాకిస్తాన్ సైన్యం(PM Modi) తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు అక్కడ మోడీ పర్యటించడంతో.. ఆ ఎయిర్ బేస్‌పై పాకిస్తాన్ దాడి జరిగిందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టమైంది.

Also Read :AP Liquor Scam : లిక్కర్ స్కాం కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్.. ఎవరు ?

ప్రధాని మోడీ ట్వీట్‌లో.. 

ఇక ఆదంపూర్ వైమానిక స్థావరం పర్యటన వివరాలతో ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు ఉదయం నేను ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారిని కలవడం అనేది చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతి పనికీ భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వారితో కలిసి దిగిన ఫొటోలను తన ట్వీట్‌లో జతపరిచారు.

Also Read :India Vs Kirana Hills: కిరానా హిల్స్‌‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్

అంతకుముందు సోమవారం రోజు భారత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ..  భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను సాధించడంలో “అచంచల ధైర్యాన్ని” ప్రదర్శించాయని కొనియాడారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని తెలిపారు.