Site icon HashtagU Telugu

Modi: భారత్ ప్రపంచ సంక్షేమాన్ని ఆకాంక్షించే దేశం-మోదీ

Pm Modi

Pm Modi

భారతదేశం ఏ ఇతర దేశాలకు, సమాజానికీ ఏనాడు ముప్పు కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని ఆకాంక్షించే దేశం భారత్ అని అన్నారు. సిక్కు గురువుల ఆలోచనలను మన దేశం అనుసరిస్తుందన్నారు. తొమ్మిదో సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోటల నిర్వహించిన కార్యక్రమంలోప్రధాన మంత్రి ప్రసంగించారు. ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ గురు తేగ్ బహదూర్ చిరస్మరణీయ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

మన దేశ గొప్ప సంస్కృతిని కాపాడేందుకు తేగ్ బహదూర్ చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పవిత్ర గురుద్వారా తేలియజేస్తుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అప్పట్లో దేశంలో మతోన్మాదం పేట్రెగిపోయిందని , మతం పేరిట సామాన్య ప్రజలపై హింసాకాండ సాగించారన్నారు. అలాంటి సమయంలో గురు తేగ్ బహదూర్ రూపంలో దేశానికి ఒక ఆలంబన దొరికిందని మోదీ గుర్తుచేసుకున్నారు. తేగ్ బహదూర్ స్మారక నాణేన్ని తపాళా బిళ్లను మోదీ ఆవిష్కరించారు.