INDIA 100 Medals : పతకాల పట్టికలో ఇండియా సెంచరీ.. ఆసియా గేమ్స్ లో దూకుడు

INDIA 100 Medals : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పరంగా సెంచరీ కొట్టింది.

Published By: HashtagU Telugu Desk
India 100 Medals

India 100 Medals

INDIA 100 Medals : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పరంగా సెంచరీ కొట్టింది. మన దేశం ఆసియా గేమ్స్ లో 100 పతకాలను కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.  ఈరోజు మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్‌ జట్టును చిత్తు చేస్తూ భారత్‌ స్వర్ణంతో మెరిసింది. మరోవైపు ఆర్చరీ ఈవెంట్‌లో మొత్తం 4 మెడల్స్ ను గెల్చుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ కూడా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఆర్చరీ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్య పతకం గెలిచింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్‌ డియోటేల్‌ స్వర్ణం గెలుచుకోగా.. అభిషేక్‌ రజత పతకాన్ని సాధించారు. దీంతో ఇప్పటివరకు భారత్‌ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కు చేరింది. ఇందులో 25 గోల్డ్ మెడల్స్, 35 రజతాలు, 40 కాంస్యాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

మరో 6 ఈవెంట్లలో కూడా..

మరో 6 ఈవెంట్లలో కూడా భారత్ కు పతకాలు దాదాపు కన్ఫార్మ్ అయ్యాయి. అంటే వాటిలో సెమీస్, ఫైనల్స్ దశల్లో మన టీమ్స్ ఉన్నాయి. భారతదేశం చాలా కాలంగా ఆసియా గేమ్స్ లో సగటున 70 పతకాలకు మించి సాధించలేకపోయింది. అయితే ఈసారి సెంచరీ మార్క్ ను సాధించడం విశేషం. గేమ్స్ ప్రారంభమైనప్పుడు ఈ సంఖ్య అసాధ్యం అనిపించింది. ఈక్వెస్ట్రియన్, సెయిలింగ్, రోయింగ్‌లలో అనూహ్యంగా లభించిన విజయాలకు తోడుగా షూటింగ్, అథ్లెటిక్స్‌లో పతకాల పంట పండింది. దీంతో 100 పతకాల దిశగా మార్గం సుగమం అయింది.

Also read : Petrol Diesel: వాహనదారులకు గుడ్ న్యూస్.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

50కిపైగా పతకాలు అథ్లెట్స్, షూటర్లవే.. 

అథ్లెటిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో భారత అథ్లెట్లు 6 స్వర్ణాలు, 14 రజతాలు, తొమ్మిది కాంస్యాలతో సహా 29 పతకాలను ఇండియాకు ఇచ్చారు. ఇందులో నీరజ్ చోప్రా (పురుషుల జావెలిన్), అన్నూ రాణి (మహిళల జావెలిన్), తజిందర్‌పాల్ సింగ్ టూర్ (పురుషుల షాట్‌పుట్), అవినాష్ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్), పారుల్ చౌదరి (మహిళల 5000 మీటర్లు), ముహమ్మద్ అనాస్, అమోజ్ జాకోబ్, ముహమ్మద్ అనాస్, అమోజ్ జాకోబ్ ఉన్నారు. రమేష్ (పురుషుల 4×400మీ రిలే) ఆరు బంగారు పతకాలను సాధించారు. ఈసారి భారత షూటర్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలతో కలుపుకొని మొత్తం 22 పతకాలను (INDIA 100 Medals)  దేశానికి అందించారు.

  Last Updated: 07 Oct 2023, 08:36 AM IST